1966 శ‌కుంత‌ల‌కి మోడ్ర‌న్ విజువ‌లైజేష‌న్?

Update: 2022-02-24 03:30 GMT
స‌మంత టైటిల్ పాత్ర‌లో శాకుంత‌లం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. పురాణేతిహాసంలో కీల‌క ఘ‌ట్టానికి సంబంధించిన క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. తాజాగా సామ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా వైర‌ల్ గా దూసుకెళ్లింది. అస‌లు ఈ మూవీకి స్ఫూర్తి ఏదీ? అన్న‌ది తెలుసుకునేందుకు జ‌నం ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు.

శతాబ్ధాల క్రితం మహాకవి కాళిదాసు నాట‌కం ఆధారంగా శకుంతల కథ పుట్టింది. దుష్యంత రాజుపై ఆమె ప్రేమకు సంబంధించిన‌ క‌థ ఇది. గూగుల్ లేదా యూట్యూబ్ లో చూసినప్పుడు 1966లో విడుదలైన లెజెండరీ ఎన్‌టి రామారావు - సరోజా దేవి నటించిన `శకుంతల` అనే తెలుగు చిత్రం ఇమేజెస్ క‌నిపిస్తున్నాయి. వీకీలోనూ స‌మాచారం ఉంది.

ఈ పౌరాణిక డ్రామా పూర్తి కథ ఏమిటో తెలుసుకోవడానికి ప్రజలు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఇంకాస్త పూర్వ‌పు రోజుల్లోకి వెళితే 1941లో దిగ్గజ ద‌ర్శ‌క‌న‌టుడు శాంతారామ్ ఈ కథను సినిమాగా తీశారు. ఇందులో జయశ్రీ శకుంతలగా కనిపించింది. ప్ర‌స్తుతం చాలా మంది తెలుగు ప్రేక్ష‌కులు యూట్యూబ్ లో ఈ రెండు సినిమాల‌ను చూస్తున్నారు.

శాకుంత‌లం గురించిన లోతైన క‌థ‌ని తెలుసుకోవాల‌నుకుంటున్నారు. ఏది ఏమైనా సమంతా చిత్రం ఈ రెండు పాత క్లాసిక్ సినిమాల కోసం వెతికేందుకు కార‌ణ‌మైంది.

సాంకేతికంగా ఇప్పుడు అంతా మారింది. వీఎఫ్ ఎక్స్ తో పాటు సౌండ్ సిస్ట‌మ్ అంతా అడ్వాన్స్ డ్ గా ఉంది. టెక్నికల్ గా విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్ గుణశేఖర్ కి పెద్ద ప్ల‌స్. కేవలం కాస్ట్యూమ్స్ స్టోరీలైన్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం కంటే లుక్ అండ్ ఫీల్ కోణంపై ఎక్కువ దృష్టి పెట్టి  స‌మంత నుంచి అద్భుత న‌ట‌న‌ను రాబ‌ట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.

భారతదేశంలోని ఫాంటసీ సినిమాలు కేవలం గ్రాఫిక్స్ తో మాత్రమే న‌డిపించేయ‌లేం.. చ‌క్క‌ని విజువ‌ల్స్ నాట‌కీయ‌త ఎమోష‌న్స్ ఇవ‌న్నీ వ‌ర్క‌వుటైతేనే జ‌నాన్ని ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు రప్పించ‌గ‌ల‌రు. ఇక సాంకేతిక‌త‌పై మ‌క్కువ ఉన్న గుణ‌శేఖ‌ర్ `ట్రాయ్` రేంజులో అద్భుత విజువ‌ల్స్ ని చూపిస్తార‌నే అభిమానులు ఆశిస్తున్నారు.
Tags:    

Similar News