మమ్మల్ని బెగ్గర్స్ గా చూడొద్దు -సంపూ

Update: 2016-06-22 13:38 GMT
బర్నింగ్ సంపూర్ణేష్ బాబు చాలాకాలం తర్వాత బండబూతులు తిట్టించుకున్నానని చెప్పాడు. 'ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. చాలా రోజుల తర్వాత ఆటా ఆర్గనైజర్ నోటి వెంట "అమ్మ అక్క లం..కొ.."బూతులు తిట్టించుకున్నాను.' అంటూ ట్వీట్ చేశాడు సంపూర్ణేష్ బాబు.

అందుకే తమ టీమ్ ఈవెంట్ కి వెళ్లడం లేదని చెప్పిన సంపూ.. అదే వ్యక్తితో ఇతర  ఆర్టిస్టులు కూడా ఇలాంటి సందర్భాలు ఫేస్ చేసి ఉన్నట్లు తెలిసిందని అన్నాడు. అసలేం జరిగిందంటే.. యూఎస్ఏ లో జరగనున్న ఆటా కార్యక్రమానికి సంపూతో పాటు మరికొందరిని అహ్వానించారు. మరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఓ ఆర్గనైజర్ నుంచి బూతులు తిట్టించుకున్నామని అంటున్నాడు. అంతేకాదు.. అమెరికాలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు.. తమను ముష్టివారుగానో.. బెగ్గర్లుగానో భావించద్దని కూడా కోరాడు.

సంపూర్ణేష్ చేసిన ఈ ట్వీట్లకు యాంకర్ కం యాక్టర్ అనసూయా భరద్వాజ్ మద్దతు తెలిపింది. ఇలాంటి మధ్యవర్తుల కారణంగా అసలు పార్టీల మధ్య వివాదాలు వస్తున్నాయని అంటోంది అనసూయ. ఇంత జరిగినా.. వచ్చే ఏడాది ఇదే ఈవెంట్ లో కలుసుకుంటానని ఆశిస్తున్నట్లు సంపూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది.
Tags:    

Similar News