నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి సీజన్లో జనవరి 9 న మొదటి భాగం రిలీజ్ అవుతోంది.. కొంత గ్యాప్ తర్వాత రెండో భాగం ఫిబ్రవరి 7 న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చేయబోయే సినిమాపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
బాలయ్యకోసం క్యూలో ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారట. అందరికంటే ముఖ్యంగా బోయపాటి శ్రీను పేరు వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్యకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడట. కానీ చరణ్ 'వినయ విధేయ రామ' రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ తయారు చేస్తాడట. ఇదిలా ఉంటే యువ దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య తో సినిమా చేసేందుకు చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాడు. బాలయ్యకు ఇప్పటికే ఒక ఇంట్రెస్టింగ్ లైన్ వినిపించి మెప్పించాడట. ఫుల్ స్క్రిప్ట్ తో బాలయ్యను ఎలాగైనా కన్విన్స్ చేయాలని పట్టుదలగా ఉన్నాడట. అనిల్ ప్రస్తుతం వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో 'F2' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కే రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కాగానే అనిల్ బాలయ్య స్క్రిప్ట్ మీదే ఫోకస్ చేస్తాడట.
ఈ ఇద్దరూ కాకుండా సీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టొరీని తన రైటింగ్ టీమ్ తో సిద్ధం చేయిస్తున్నాడట. త్వరలో ఈ కథను వినిపించి బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం తీసుకునేలా గట్టిగా ట్రై చేస్తున్నాడట. ఎవరి ప్రయత్నాలు వారివే గానీ బాలయ్య మదిలో ఎవరున్నారు.. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటేస్తారు అన్నది వేచి చూడాల్సిందే.