ఇటీవల వరుస ప్రమాదాలు టాలీవుడ్ ను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఆద్యంతం రోడ్ టెర్రర్ సెలబ్రిటీల్ని భయపెట్టింది. తాజాగా సప్తగిరి ఎల్.ఎల్.బి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చరణ్ లక్కాకులకు రోడ్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ ఫిలింనగర్ లో కారు డ్యాష్ ఇవ్వడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలారని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అని స్థానికుల్ని ప్రశ్నిస్తే.. నిలకడాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఘనటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలవ్వడంతో అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
చరణ్ లక్కాకుల తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉన్నారు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా.. అసోసిసియేట్ గా.. కోడైరెక్టర్ గా పనిచేసారు. చిత్రపురి హిల్స్ లోనే ఆయన నివాసం ఉంటున్నారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమా సప్తగిరి ఎల్.ఎల్.బి. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన రెండవ చిత్రమిది. బాలీవుడ్ లో విజయం సాధించిన జాలీ ఎల్.ఎల్.బి సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఆద్యంతం ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
సప్తగిరి తొలి సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ మంచి విజం సాధించడంతో ఆ క్రేజ్ తోనే సప్తగిరి పేరునే సినిమా టైటిల్ గా పెట్టి మరోసారి ప్రయోగం చేశామని దర్శకుడు చరణ్ లక్కాకుల అప్పట్లో వెల్లడించారు. దర్శకుడిగా అతడికి పేరొచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం దక్కకపోవడంతో ఆ తర్వాత అతడు ఆశించిన అవకాశాలు దక్కలేదు.