సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తోన్న `సర్కారు వారి పాట` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈనెల 12న భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. ఇప్పుడా అంచనాలు మరింత రెట్టింపు చేయబోతుంది సర్కారు వారి టీమ్. ఈనెల 7న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున అభిమానులు..సినీ ప్రముఖుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాకాలు చేస్తోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య తిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మహేష్ అండ్ కో పీకేని వేడుకకు ఆహ్వానించినట్లు గుసగుస వినిపిస్తుంది. అదే నిజమైతే సర్కారు ప్రాంగణం అభిమానుల కేరింతలతో దద్దరిల్లడం ఖాయం. ఓవైపు మహష్ అభిమానులు..మరోవైపు పీకే అభిమానులతో ప్రీ రిలీజ్ వేడుక మోతెక్కడం షురూ.
దాదాపు ఆ ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మహష్ తన సినిమా ఈవెంట్లకు టాలీవుడ్ స్టార్లని రంగంలోకి దించుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి..యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మహేష్ సినిమా ఈవెంట్లకు ముఖ్య అతిధులుగా హాజరై ఆ సినిమాల్ని పెద్ద సక్సెస చేసారు. అందుకే ఇప్పుడు సర్కారు వారి కోసం పవర్ స్టార్ పీకేని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
అలాగే అవసరం మేర మహేష్ సైతం ఆ స్టార్ హీరోల సినిమాలకు సహకరిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన `ఆచార్య` సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన `జల్సా` సినిమాకు ఇదే తరహాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అప్పటి నుంచి పీకే -మహేష్ కి రుణపడి ఉన్నారు. ఇప్పుడా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.
కాబట్టి పవన్ కళ్యాణ్ సర్కారు వారి ఈవెంట్ కి హాజరయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు టాలీవుడ్ పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకుసాగుతుంది. ఒకప్పటిలా పోటీ వాతావరణం కనిపించలేదు. హీరోలు ఒకరికొకరు పోటీ సినిమాల్ని రిలీజ్ చేయడం లేదు. అంతా అండర్ స్టాండింగ్ మీద ముందుకు వెళ్తున్నారు.
ఒకరి సినిమాలకు మరో స్టార్ హీరో అతిధిగా హాజరవ్వడం పరిపాటిగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలవురు హీరోల వేడుకలుకు అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మహేష్ ఆహ్వానాన్ని మన్నించి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గత ఈవెంట్లో మహేష్ మేమంతా బాగానే ఉంటాం. మీరే ఇంకా బాగుండాలని అభిమానం పేరుతో దూషించుకోవద్దని పరక్షంగా చెప్పారు.
మళ్లీ సర్కారు వారి ఈవెంట్లోనే ఇవే అంశాలు మహేష్-పీకే నోట వచ్చే అవకాశం ఉంది. అయితే పీకే వస్తున్న విషయాలు ఇంకా అధికారికంగా యూనిట్ వెల్లడించలేదు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పీకే వస్తారని ప్రచారం సాగింది. కానీ ఆయన రాలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.