మహేశ్ బాబు వరుస సక్సెస్ లతో ఉన్నాడు. ఇదే రేంజ్ లో ఆయన హిట్స్ పరంపరను కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన 'సర్కారువారి పాట'ను చేశాడు. మైత్రీ మూవీస్ -14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు.
పరశురామ్ కి లవ్ .. యాక్షన్ .. కామెడీపై మంచి పట్టుందనే విషయం 'గీత గోవిందం' సినిమాతో అర్థమైపోయింది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తమన్ స్వరపరిచిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో మహేశ్ బాబు యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది.
ఆ క్యారెక్టరైజేషన్ నచ్చడం వల్లనే మహేశ్ బాబు ఈ సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పారు. కథ చాలా బాగుంది .. చేద్దాం అనేసిన తరువాత, హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారు? అని అడిగారు. అప్పటికి నా మనసులో కీర్తి సురేశ్ ఉన్నారు.
కీర్తి సురేశ్ యాక్టింగ్ చూసిన దగ్గర నుంచి తనతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ కుదరడం లేదు. అందువలన మహేశ్ బాబుగారు అడగ్గానే ఆమె పేరు చెప్పేశాను. 'బావుంటుంది .. అలాగే కానియ్యండి' అన్నారాయన. అలా ఈ సినిమా కోసం కీర్తి సురేశ్ ను తీసుకోవడం జరిగింది. 'గీత గోవిందం' సమయంలోనే, తరువాత సినిమా ఎవరితో అని అరవింద్ గారు అడిగారు. 'మహేశ్ బాబుకి కథ చెప్పాలని అనుకుంటున్నను సార్' అన్నాను. 'నువ్వు తీయగలవ్ .. చేయగలవ్ .. కానీ' అన్నారాయన.
అప్పుడు నా మీద నాకు మరింత నమ్మకం కలిగింది. అప్పుడు మహేశ్ బాబుగారి కోసం కథ రెడీ చేశాను. ఈ కథ పుట్టిందే మహేశ్ బాబు కోసం. ఈ సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ .. డాన్సులు .. ఫైట్లు వేరే లెవెల్లో ఉంటాయి. ఈ కథను మహేశ్ బాబు కాదంటే పక్కన పెట్టేసేవాడిని. ఎందుకంటే ఇది ఆయన చేస్తేనే బాగుంటుంది. ఇక కీర్తి సురేశ్ కాదనే ఛాన్సే లేదు. ఎందుకంటే నేను ఇచ్చిన నెరేషన్ అలాంటిది. థియేటర్స్ కి వచ్చిన ఫ్యాన్స్ కి ఈ సినిమా పండుగ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు" అని చెప్పుకొచ్చాడు.