అదితిరావుపై మాజీ భ‌ర్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2023-02-03 21:00 GMT
అదితీరావు హైద‌రీ.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరిది. మ‌మ్ముట్టి న‌టించిన `ప్ర‌జాప‌తి` సినిమాతో న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఈ హైద‌రాబాదీ న‌టి ఢిల్లీ 6, దోభీ ఘాట్‌, రాక్ స్టార్‌, మ‌ర్డ‌ర్ 3 వంటి సినిమాల‌తో పాపుల‌ర్ అయింది. ఆ త‌రువాత ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు న‌టించిన `స‌మ్మోహ‌నం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. శ‌ర్వానంద్ , సిద్ధార్ధ్ క‌లిసి న‌టించిన `మ‌హా స‌ముద్రం`లో మెరిన అదితి అప్ప‌టి నుంచి నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది.

ఈ మూవీ స‌మ‌యంలో హీరో సిద్ధార్ద్ తో ఏర్ప‌డిన స్నేహం డేటింగ్ కు దారి తీసింద‌ని, వీరిద్ద‌రు గ‌త కొంత కాలంగా డేటింగ్ లో వుంటున్నార‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ రీసెంట్ గా హీరో శ‌ర్వానంద్ నిశ్చితార్థంలో ఈ జంట త‌ళుక్కున మెరిసింది. శ‌ర్వా దంప‌తుల‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చింది. దీంతో వీరిద్ద‌రు డేటింగ్ లో వున్నార‌ని అంతా ఫిక్స‌యిపోయారు. అంతే కాకుండా త్వ‌ర‌లో వీరిద్ద‌రు కూడా పెళ్లి చేసుకునే అవ‌కాశం వుంద‌నే వార్త‌లు మొద‌ల‌య్యాయి.

ఇదిలా వుంటే అదితి రావు హైద‌రిపై మాజీ భ‌ర్త స‌త్య‌దీప్ మిశ్రా తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. 2009లో అదితి బాలీవుడ్ న‌టుడు స‌త్య‌దీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో 2013లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. కానీ స‌త్య‌దీప్ మిశ్రా రీసెంట్ గా బాలీవుడ్ న‌టి, నీనా గుప్తా కూతురు మ‌స‌బా గుప్తాని రెండో పెళ్లి చేసుకున్నాడు.  

ఈ సంద‌ర్భంగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అదితి రావు హైద‌రీపై స‌త్య‌దీప్ మిశ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అదితితో నా రిలేష‌న్ కార‌ణంగా ప్రేమ‌పై నాకు విర‌క్తి క‌లిగింది. మ‌రోసారి ప్రేమ‌య పెళ్లి అంటే భ‌యం వేసింది. బ్రేక‌ప్ అనుభ‌వం ఎదురైన వాళ్లు మ‌ళ్లీ రిలేష‌న్ , ప్రేమ అంటే భ‌య‌ప‌డ‌తారు. కానీ ధైర్యంగా ముంద‌డుగు వేస్తేనే కోల్పోయిన‌వి పొంద‌గ‌లం` అని తెలిపాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News