`అర్జున్ రెడ్డి` బ్యూటీ షాలిని పాండే ప్రస్తుతం ఏం చేస్తోంది? అంటే ఇదిగో ఇలా బ్రాండ్ పబ్లిసిటీ కోసం తహతహలాడుతోంది. ప్రఖ్యాత రీబాక్ బ్రాండ్ కి ప్రచారకర్తగా మారింది ఈ భామ. ఇతర నాయికల్లానే ఈ అమ్మడు కూడా ఇటీవల వరుస ఫోటోషూట్లు షేర్ చేస్తూ సోషల్ మీడియాల్లో అసాధారణంగా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఆ క్రమంలోనే ప్రఖ్యాత బ్రాండ్లు తన ఖాతాలో చేరుతున్నాయి. సోషల్ మీడియాల ప్రకటనల ద్వారా ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగానే వర్ధిల్లుతోందిట.
``మీలో శక్తిని మరింత డైనమిక్ గా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. సంథింగ్ మ్యాజికల్...!`` అంటూ స్టార్స్ సింబల్ ఈమోజీల్ని షాలిని షేర్ చేసింది. అలా ఇసుకలో రీబాక్ షూ లేసుల్ని బిగించేస్తోంది. షాలిని బ్యూటిఫుల్ స్మైల్ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.
`నిశ్శబ్ధం` ఫ్లాపయ్యాక సైలెంట్ గా బాలీవుడ్ కి జంప్ అయిన షాలిని ప్రస్తుతం అక్కడ బిజీ నాయికగా మారింది. జయేష్ భాయ్ జోర్దార్.. మహారాజా అనే రెండు క్రేజీ హిందీ చిత్రాలతో షాలిని బిజీగా ఉంది. జయేష్ భాయ్ జోర్ధార్ లో రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది.
`మహారాజా` పీరియడ్ డ్రామాతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం. ఈ చిత్రంతోనే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. షాలిని అతడి సరసన ఆడిపాడనుంది. రాణీ ముఖర్జీతో హిచ్ కి తెరకెక్కించిన సిద్ధాంత్ పి.మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజు ఉన్నప్పుడే ఆర్జించాలి! అన్న ప్రతిపాదికన ప్రఖ్యాత బ్రాండ్లకు షాలిని సంతకాలు చేస్తోంది.