ముద్దబంతిలాంటి పిల్ల ఇలాగైపోయిందేంటి?

Update: 2021-03-18 11:34 GMT
షాలినీ పాండే పేరు వినగానే 'అర్జున్ రెడ్డి' సినిమా గుర్తుకువస్తుంది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో 'ఆ పిల్ల నాది' అంటూ అర్జున్ రెడ్డి చెప్పే డైలాగ్ ఒక రేంజ్ లో పాపులర్ అయింది. ఈ సినిమాలో ఈ పిల్లను చూసిన వాళ్లంతా 'ఆ పిల్ల నాది' అనే అనుకున్నారు. కాకపోతే ఆ విషయం అర్జున్ రెడ్డితో చెప్పలేదు. విశాలమైన కళ్లు .. నీలి మేఘాల్లాంటి కనుబొమలు .. చక్కని నాసిక .. చిక్కని పెదాలతో ఈ అమ్మాయి, పిట్టగోడంత తేలికగా కుర్రాళ్ల గుండెగోడలను కూలగొట్టేసింది.

కొండపల్లి బొమ్మలాంటి ఈ అమ్మాయి కనుబొమల మధ్యలో కుర్రాళ్లంతా తమ మనసుకు ఊయల కట్టారు. ఆ పిల్ల కాకుండా మరెవరైనా కలలోకి వస్తే బయటికి నెట్టారు. పనసతొన్నలాంటి ఈ అమ్మాయి నీడలో టెంట్ వేసుకుని పడుచుదనమంతా గడిపేయలనే నిర్ణయానికి వచ్చేశారు. పాలపుంతలా .. వెన్నముంతలా కనిపించే ఈ సుందరికి అభిమానిగా పడిఉండటం వల్లనే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుందని భావించారు. తెరపై షాలినీ కనిపిస్తే ఆమె పాత్ర కాకుండా పండుగ వచ్చినట్టుగా ఫీలయ్యారు. థియేటర్లలో ఆమెను వదిలిరావడానికి దిగాలు పడిపోయారు.

అంతలా కుర్రాళ్లను ఊపేసిన షాలినీ పాండే తాజాగా ఇన్ స్టాలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె బ్లాక్ అండ్ వైట్ కురచ దుస్తులతో కనిపించింది. కావాలని కసరత్తు చేసిందో .. అవకాశాలు లేవని బెంగేపెట్టేసుకుందో తెలియదుగానీ చాలా సన్నబడిపోయింది. ఆ రూపంలో మునుపటి ఆకర్షణ లేదు .. ఆ కళ్లలో మునుపటి కాంతి లేదు. వరుసబెట్టి సినిమాలు చేసిందేమో అలసిపోయింది అనుకోవడానికి అదీ లేదు. ఫిట్ నెస్ కి దూరంగా .. నాజూకుదనానికి భారంగా కనిపించే ఈ ఫొటో చూస్తే, ఆ పిల్ల నాది అనుకున్న కుర్రాళ్లంతా నీరసించిపోవడం .. నిరాశపడిపోవడం ఖాయం.


Tags:    

Similar News