హీరో శర్వానంద్ సోమవారం పెందుర్తి పరిధిలోని సింహగిరి ఆలయానికి వెళ్లారు. కుటుంబంతో సహా వెళ్లిన శర్వా ఆలయంలో కూర్చున్నారు. పూజారి మంత్రాలు చదివారు. ధాన్యంలో చిన్నారితో అక్షరాలు రాయించారు. ఆ తర్వాత పలకపై చిన్నారితో శర్వా అక్షరాలు దిద్దించారు. అంతే.. కట్ చెప్పారు దర్శకుడు!
ఇదంతా శర్వానంద్ అప్ కమింగ్ మూవీ ‘సముద్రం’లోని సన్నివేశం. సింహగిరి ఆలయంలో షెడ్యూల్ ప్లాన్ చేసిన దర్శకుడు పలు సీన్లు షూట్ చేశారు. హీరో కుటుంబంతో ఆలయానికి రావడం, అక్షరాభ్యాసం చేయించడం, ఓ స్వామీజీ ప్రవచనం వినడం.. వంటి సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ 34 రోజులు చేశామని, ఇప్పుడు ఇక్కడ చిత్రిస్తున్నామని చెప్పారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.
కాగా.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి, హీరో శర్వా అభివాదం తెలుపుకొని పలు విషయాలు చర్చించుకున్నారు. అనంతరం శర్వా ఆలయంలో పలు పూజలు చేశారు.