మార్వెల్ స్టూడియోస్ 'హల్క్' గురించి పరిచయం అవసరం లేదు. సూపర్ హీరోల సిరీస్ లో 'హల్క్' కి వరల్డ్ వైడ్ గా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కామిక్ బుక్స్ లోని ఊహాత్మక పాత్రలని తెరపై సూపర్ పవర్స్ గా ఆవిష్కరించడంలో మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక శైలి కలిగి ఉంటుంది. ఒక చిత్రంతో మరో చిత్రానికి లింక్ చేసి సూపర్ హీరోల కాంబినేషన్స్ తెరపై వండర్ గా ఆవిష్కరించడం మార్వెల్ కే చెల్లింది.
'హల్క్' సిరీస్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం మార్కెల్ కే సొంతం. అలాంటి ప్రతిష్టాత్మక మార్వెల్ స్టూడియోస్ అందిస్తున్న మరో తాజా చిత్రం 'షి-హల్క్'. తాజాగా ఈ వెబ్ సీరిస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.
హాలీవుడ్ నటి టాటియానా మాస్లానీ 'షి-హల్క్ ' లీడ్ రోల్ కనిపిస్తుంది. టటియానా ఈ చిత్రంలో జెన్నీఫర్ వాల్టర్స్ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తుంది. ఆమెకు కూడా అనుకోకుండా హల్క్ తరహా సూపర్ పవర్స్ వస్తాయి.
మగాళ్ళకి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు ఒక లేడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందన్నది ట్రైలర్‌లో చూపించారు. యాక్షన్ కంటెంట్ కంటే కామెడీకే ట్రైలర్ లో ప్రాధాన్యత ఎక్కువ కనిపిస్తుంది. బీజీఎమ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మొత్తం ట్రైలర్ అయితే ఏమంత ఆసక్తికరంగా లేదు.
ఎగ్టైట్ మెంట్ తీసుకురావడంలో ట్రైలర్ కిక్ ఇవ్వలేదు. మరి అందమైన అమ్మాయిలు కండల తిరిగిన మహిళగా కనిపించడం అన్నది ఎంత వరకూ యాక్సప్టెన్సీ ఉంటుందన్నది చూడాలి. టాటియానా హల్క్ గా రూపాంతరం చెందే సన్నివేశాలు పేలవంగా అనిపిస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హల్క్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసే చిత్రంగా ఉందంటూ విమర్శిస్తున్నారు. మరి వాటిని ఎలా తిప్పికొడుతుందన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
Full View