జయమ్ము నిశ్చయమ్మురా.. చాలా కథ ఉంది

Update: 2016-11-24 15:30 GMT
కమెడియన్ టర్న్డ్ హీరో శ్రీనివాసరెడ్డి లీడ్ రోల్ చేసిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఈ శుక్రవారం పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతోంది. శ్రీనివాసరెడ్డి స్థాయికి.. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కు సంబంధం లేదు. ఈ విషయంలో దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక కొత్త దర్శకుడు తన స్వీయ నిర్మాణంలో సినిమా తీయడం ఆశ్చర్యకరమైన విషయం. శివరాజ్ ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడమే కాదు.. సినిమాను పక్కా ప్లాన్ తో బాగా ప్రమోట్ చేశాడు కూడా. అందుకే ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక ఈ సినిమా చేసేముందు తాను ఇంకా ఎంతో కసరత్తు చేశానని.. స్క్రిప్టు కోసం చాలా శ్రమించానని అంటున్నాడు శివరాజ్.

‘‘రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి ‘అల్ప జీవి’ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాను. దాంతో పాటు రాబర్ట్ హ్యమర్ రాసిన ‘స్కూల్ ఆఫ్ స్కౌండ్రల్స్’.. బసు ఛటర్జీ ‘చోటీ సే బాత్’. బిల్లీ వైల్డర్ ‘ది అపార్ట్మెంట్’ ప్రభావం కూడా ఈ సినిమాపై ఉంది. మామూలుగా సినిమా వినోద ప్రధానంగా నడుస్తుంది. ఐతే నేను వినోదంతో పాటు ప్రేక్షకుడి ఒక అనుభవం.. అనుభూతి కూడా ఇచ్చేలా సినిమా తీయాలనుకున్నా. అందుకే చాలా వరకు నిజ జీవితంలోని మనుషులు గుర్తుకొచ్చేలా పాత్రల్ని తీర్చిదిద్దాను. పాత్రలతో పాటు లొకేషన్లు కూడా రియలిస్టిగ్గా ఉండాలనుకున్నా. అందుకే కరీంనగర్.. కాకినాడ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి లొకేషన్లను ఎంచుకున్నాను. సినిమాలో ప్రతి పాత్ర.. ప్రతి సన్నివేశం కథకు రిలేటయ్యేలాగే ఉంటాయి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది’’ అని శివరాజ్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News