హీరోల్లో మార్పులు రావాల్సిందే!

Update: 2022-08-19 04:37 GMT
మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో హీరోల్లో మార్పులు రావాల్సిందేనా? అంటే అవునే స‌మాధానం వినిపిస్తోంది. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు తెర‌వ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు వినోదం కోసం ఓటీటీల‌ని, యూట్యూబ్  ప్ర‌ధానంగ ఎంచుకున్నారు. క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు జ‌నం ఇంటి ప‌ట్టునే వున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఓటీటీ, యూట్యూబ్ లే వీరికి ప్ర‌ధాన కాల‌క్షేపాలుగా మారాయి. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ సినిమాని ఓ రౌండ్ వేసేశారు.

ఎక్క‌డ ఏ స్థాయి కొత్త కంటెంట్ ల‌భిస్తోందో.. ప్ర‌పంచ సినిమా ఎన్ని కొత్త పుంత‌లు తొక్కుతోందో గ్ర‌హించారు. దీంతో స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడిలో ప్ర‌పంచ సినిమా ప‌ట్ల మేక‌ర్సే ఆశ్చ‌ర్య‌పోయు స్థాయిలో సంపూర్ణ అవ‌గాహ‌ణ మొద‌లైంది. దీంతో సాధార‌ణ కంటెంట్ అయినా స‌రే ఒక‌సారి చూద్దాం అని అనుకున్న వాళ్లంతా ఇప్పుడు అలాంటి వాటికి దూరంగా వుంటున్నారు. బెస్ట్ అనిపిస్తేనే దాన్ని ట‌చ్ చేస్తున్నారు.

త‌మ‌కు బెస్ట్ కంటెంట్ అనిపించ‌ని వాటిని ఎలాంటి మొహ‌మాటం లేకుండా తిర‌స్క‌రిస్తున్నారు. స్టార్ లు న‌టించినా.. క్రేజీ స్టార్ లు న‌టించిన సినిమాలైనా ఒకే లెక్క‌న చూస్తున్నారు. కంటెంట్ వున్న‌దే స్టార్ సినిమాగా ప‌రిగ‌ణిస్తూ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జింపుల్ గా నిలిచిన మూవీ 'కేజీఎఫ్‌'. ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ అయిన‌ప్పుడు హీరో ఎవ‌రో తెలియ‌దు, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అస్స‌లే తెలియ‌దు. క‌న్న‌డ హీరో య‌ష్ కు పెద్ద‌గా మార్కెట లేదు. అక్క‌డ పెద్ద స్టార్ హీరో కూడా కాదు.

కానీ కంటెంట్ ని న‌మ్ముకుని సినిమా చేశారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించారు. చార్ట‌ర్ 2 కూడా ఇదే ఫార్ములాతో విడుద‌లై అంద‌రి క‌ళ్లు తెరిపించి బాక్సాఫీస్ లెక్క‌ల‌నే మార్చి ట్రేడ్ వ‌ర్గాల‌ని సైతం విస్మ‌యానికి గురిచేసింది. నార్త్ లో ఈ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. దీనిక ఇకార‌ణం హీరో , డైరెక్ట‌ర్ల‌ని మించి కంటెంట్ కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.. అందుకే ఈ మూవీకి క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ప్ర‌స్తుతం మారిన ప్రేక్ష‌కుడి ఆలోచ‌నా ధోర‌ణి కార‌ణంగా మూడు ఫైట్లు, ఆరు పాట‌లు అనే మూస ఫార్ములా క‌థ‌ల‌కు కాలం చెల్లింది. కంటెంట్ ఫ‌స్ట్ త‌రువాతే స్టార్‌. ఎంత స్టార్ డమ్ వున్నా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన 'ఆచార్య‌'లో కంటెంట్ లేక‌పోవ‌డంతో వారి స్టార్ డ‌మ్ ఆ సినిమాని ఏ విష‌యంలోనూ కాపాడ‌లేక‌పోయింది. ఇక రూ. 350 కోట్ల బ‌డ్జెట్ తో ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ, ఎపిక్ ల‌వ్ స్టోరీ అని చేసినా ప్ర‌భాస్ 'రాధేశ్యామ్‌'ని ఎవ‌రూ కాపాడ‌లేక‌పోయారు.

ర‌వితేజ న‌టించిన 'రామారావు ఆన్ డ్యూటీ', రామ్ న‌టించిన 'ది వారియ‌ర్‌', రీసెంట్ గా నితిన్ 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' ఆ మ‌ధ్య విడుద‌లైన వ‌రుణ్ తేజ్ 'గ‌ని' పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కంటెంట్ లేక‌పోవ‌డ‌మే. కంటెంట్ వుంటే తెలియ‌ని హీరో సినిమా అయినా బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు వ‌ర్షం కురిపిస్తుందిని 'కేజీఎఫ్' నిరూపించింది. కంటెంట్ వున్న సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని ఇటీవ‌ల విడుదలైన 'బింబిసార‌', సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు నిరూపించాయి. సో దీన్ని బ‌ట్టి ఏం అర్థ‌మైందంటే ప్రేక్ష‌కులు మారారు... మారాల్సింది హీరోలే.. కోట్ల బ‌డ్జెట్ పెట్టి క‌థ‌లేకుండా స‌ర్క‌స్ చేయ‌డాన్ని ప‌క్క‌న పెట్టి కంటెంట్ పై దృష్టి పెడితే ఇండ‌స్ట్రీకి మ‌ళ్లీ మంచి రోజులొస్తాయి. ఆ దిశ‌గా హీరోలంతా మార‌తార‌ని ఆశిద్దాం.
Tags:    

Similar News