భారీ క్రేజీ చిత్రాలు ట్రైలర్ లు వరుసగా క్యూ కట్టేస్తున్నాయి. ఇప్పటికే `పుష్ప` ట్రైలర్ నెట్టింట సందడి చేసి సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇదే కోవలో `ఆర్ ఆర్ ఆర్` ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై వరల్డ్ వైడ్‌గా వున్న సినీ ప్రియుల్ని సంభ్రమాశ్చర్యాలకి లోను చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ఫీవర్ తగ్గక ముందే మరో క్కరేజీ మూవీ ట్రైలర్ నెట్టింట సందడి చేయడం మొదలైంది. అదే `శ్యామ్ సింగ రాయ్` ట్రైలర్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీ రెండు కాలాల నేపథ్యంలో పిరియాడిక్ టచ్ తో సాగనుంది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు.
ఈ మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ మంగళవారం వరంగల్ లో ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకునే వాసు అనే యువకుడు తన గాళ్ ఫ్రెండ్ నే హీరోయిన్ గా పెట్టి ప్రయత్నాలు చేసే సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. లోబడ్జెట్ సినిమా చేయాలనేది వాసు కల.. ఇందు కోసం సాఫ్ట్ వేర్ జాబ్ ని కూడా వదులుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ప్రయత్నాల్లో కృతిశెట్టి పై ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీస్తుంటాడు. ఇతని షూటింగ్ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది. మార్కెట్ లో జరిగిన గొడవలో తలపై గాయం కావడంతో వాసుకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్టుగా చూపించిన తీరు కథని రవీల్ చేస్తున్నట్టుగా వుంది.
ఈ క్రమంలో పోలీస్ పాత్రలో మడోన్నా సెబాస్టియన్ ని పోలీస్ ఆఫీసర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు వాసుకు గత జన్మజ్ఞాపకాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఓ బెంగాళీ పుస్తకంలోని అక్షరాలని తడుముతూ తదేకంగా ఆలోచిస్తున్నట్టుగా చూపించాడు. హ్యూమన్ కాన్షియస్ ఫుల్ ఆఫ్ ఓసియన్ సీక్రెట్స్ అని ఓ లేడీ వాయిస్ తో చెప్పించడం...ఆ వెంటనే వాసు పాత్ర శ్యామ్ సింగ రాయ్ పేరుని పలకడం.. ఓ గోడపై శ్యామ్ సింగ రాయ్ ఫొటో వున్న ఓ పోస్టర్ ని చూపించిన తీరు ఆ వెంటనే ఆ పాత్రని పరిచయం చేసిన తీరు సినిమా ఓ రేంజ్ లో వుంటుందనే సంకేతాల్ని అందిస్తోంది.
`నా సిద్దాంతం వేరు.. వాడి గుడిసె జోలికి వెళ్లావో... నీ ఇళ్లెక్కడుందో ఈ శ్యామ్ సింగ రాయ్ కి బాగా తెలుసు.. అంటూ నాని మీసం మెలేస్తూ చెబుతున్న డైలాగ్‌లు.. థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లతో పాటు విజిల్స్ వేయించేలా వున్నాయి. పేదవారికి అండగా నిలబడి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే మూకపై ఎదురుదాడికి దిగడం... నీకెందుకు రా దేవి (సాయి పల్లవి) మీద అంత భక్తి అని రాహుల్ రవీంద్రన్ అడగడం..భక్తి కాదురా...ప్రేమ` అని నాని చెప్పడం.. ఆ వెంటనే సాయి పల్లవి పాత్రని పరిచయం చేయడం...`నోనొక దేవదాసిని..ఆ విషయం మరిచిపోకు..` అంటూ సాయి పల్లవి గుర్తు చేయడం..పిరికి వాళ్లే కర్మ సిద్దాంతం మాట్లాడతారు.ఆత్మాభిమానం కన్నా ఏ యాగమూ గొప్పది కాదు..అప్పని తెలిశాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పేమి లేదు. అనే డైలాగ్స్ వినిపిస్తుండగా.. సాయి పల్లవి అపరకాళికగా కనిపిస్తున్న దృశ్యాలు...మిక్కీ .ఏ మేయర్ అందించిన నేపథ్య సంగీతం రోమాంచితమైన అనుభూతికి లొనే చేస్తోంది. ఇంతకీ సినిమా డైరెక్టర్ కావాలనుకున్న వాసుకు.. ఎప్పుడో దేవదాసీ వ్యవస్థపై కోల్‌కత్తాలో తిరుగు బాటు చేసిన శ్యామ్ సింగ రాయ్ కున్న సంబంధం ఏంటీ? అన్నదే ఇందులో ఆసక్తికరం.
క్లిష్టమైన స్క్రీన్ ప్లేతో రాహుల్ సంక్రీత్యన్ చేస్తున్న ఈ సాహసం తెలుగు ప్రేక్షకులకు `శ్యామ్ సింగ రాయ్` రూపంలో ఓ సరికొత్త చిత్రాన్ని.. సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. దేవ దాపీ వ్యవస్థని ప్రధానంగా తీసుకుని రాహుల్ చేసిన ఈ చిత్రంలో నెవర్ బిఫోర్ అనే స్థాయిలో నేచురల్ స్టార్ నాని `శ్యామ్ సింగ రాయ్ పాత్రని రక్తికట్టించినట్టుగా కనిపిస్తోంది. 1970 కాలం నాటి కథ నేపథ్యంలో నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఈ నెల 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకట్ బోయిన పల్లి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని నుంచి ఎక్స్ పెక్ట్ చేయని సరికొత్త కథగా వస్తున్న ఈ సినిమా విజువల్ పరంగా... కంటెంట్ పరంగా సరికొత్త రికార్డుల్ని సృష్టించి నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మర్చిపోలేని చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
Full View