తల్లి కోరిక నెరవేర్చేందుకు సోనూసూద్‌ షాకింగ్‌ ప్రకటన

Update: 2020-09-13 04:00 GMT
ఈమద్య కాలంలో సోనూసూద్‌ రియల్‌ హీరో అయ్యాడు. సూపర్‌ స్టార్‌ లు బ్లాక్‌ బస్టర్‌ స్టార్స్‌ మెగాస్టార్స్‌ అంతా కూడా ఈయన ముందు దిగదుడుపే అన్నట్లుగా ఈయనకు పేరు వచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు సోనూసూద్‌ అంటే ఒక విలన్‌. సినిమాల్లో ఆయన్ను ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు విలన్‌ గా తప్ప ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చూడలేదు. కాని ఇప్పుడు ఆయనలోని రియల్‌ హీరోయిజంను చూస్తున్నారు. కోట్లాది రూపాయలను ఆయన దాన ధర్మాలకు ఖర్చు చేస్తూ ఉండటం గురించి సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. వలస కార్మికులను వారి వారి స్థానాలకు పంపించడం నుండి మొదలుకుని తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ ప్రకటన వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న సాయం గురించి నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంది.

పంజాబ్‌ లో తన తల్లి ఒక సాదారణ టీచర్‌ అని ఆమె పిల్లల చదువుకు ఏదైనా సాయం చేయమంటూ పదే పదే కోరేవారట. కాని అప్పుడు వీలు పడలేదు కాని అమ్మ కోరిక మేరకు ఇప్పుడు పిల్లల చదువుకు సాయం చేసేందుకు సిద్దం అయినట్లుగా సోనూ భాయ్‌ ప్రకటించాడు. ఈయన దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ అందించేందుకు సిద్దం అయ్యాడు. కాలేజ్‌ స్టూడెంట్స్‌ ఎవరైనా కూడా సాయం కోసం తనకు దరకాస్తు చేసుకోవచ్చు అంటూ తెలియజేశాడు. అయితే అందుకు కొన్ని కండీషన్స్‌ పెట్టాడు. కుటుంబం వార్షిక ఆదాయం రెండు లక్షలు దాటకుండా ఉండాలి. అలాగే చదువులో మంచి ప్రతిభ కనబర్చిన వారై ఉండాలి. వారికి ఖచ్చితంగా చదువుతో పాటు వసతి మరియు భోజన సదుపాయంను తానే కల్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. సోనూసూద్‌ ప్రకటన నిజంగా షాకింగ్‌ విషయం. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు సోనూసూద్‌ వద్దకు సాయం కోసం వస్తారు. వారందరిలో ఎంత మందికి ఆయన న్యాయం చేస్తాడు అనేది చూడాలి. ఏడాదిలో రెండు వందల నుండి మూడు వందల మంది వరకు స్కాలర్‌ షిప్‌ ఇచ్చే ఉద్దేశ్యంతో సోనూసూద్‌ నిధులు సమకూర్చుతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
Tags:    

Similar News