ముందు తెలుగులో సీరియళ్లలో నటించింది శ్రీదివ్య. ఆ తర్వాత మనసారా.. బస్ స్టాప్ లాంటి చిన్న సినిమాల్లోనే నటించింది. ఇక్కడ పెద్దగా పేరు రాకపోయినా... తమిళనాట మాత్రం అమ్మడు మంచి స్థాయినే అందుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాకు 40-50 లక్షల మధ్య పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్టుగా హై ఎండ్ బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయడం విశేషం. ఆ కారుకు హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ జరగడాన్ని బట్టి ఆమె ఇక్కడే కారును కొన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో శ్రీదివ్య స్థాయి ప్రకారం చూస్తే బీఎండబ్ల్యూ పెద్దదే కావచ్చు కానీ.. తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఆమె రేంజే వేరు.
తమిళంలోకి వెళ్లిన చాలామంది తెలుగు హీరోయిన్ల మాదిరే శ్రీదివ్య కూడా అక్కడ స్టార్ స్టేటస్ సంపాదించింది. తన నటనతో ఇప్పటికే చాలా సినిమాల్లో మెప్పించింది శ్రీదివ్య. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. కార్తి హీరోగా తెరకెక్కిన 60 కోట్ల సినిమా ‘కాష్మోరా’లోనూ ఆమె కీలక పాత్ర చేసింది. ఇంకా జీవా హీరోగా తెరకెక్కుతున్న ‘సంగిలి బుంగిలి కాదవ తోరే’ సినిమాలోనూ ఆమే హీరోయిన్. ఇంకా మూణ్నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగులో ఆమె చివరగా ‘కేరింత’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడినా.. శ్రీదివ్యకు అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టలేదు. రచ్చ గెలిచి.. తనేంటో రుజువు చేసిన శ్రీదివ్య ఇంట ఎప్పుడు గెలుస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/