‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూసిన వాళ్లంతా శ్రీవిష్ణుకు హీరోగా అంత ప్రాధాన్యమైన పాత్ర.. నారా రోహిత్ సపోర్టింగ్ రోల్ తరహా పాత్ర ఎందుకు చేశాడబ్బా అని ఆశ్చర్యం కలిగింది. పైగా ఈ చిత్రాన్ని రోహితే స్వయంగా నిర్మించడం కూడా చాలామందికి మింగుడు పడలేదు. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేని శ్రీవిష్ణు మీద రోహిత్ అంత ఫోకస్ పెట్టడమేంటన్న చర్చ జరుగుతోంది కొన్నాళ్లుగా. ఐతే రోహిత్.. శ్రీవిష్ణుల గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్లకు ఇదేమీ ఆశ్చర్యంగా అనిపించదు.
రోహిత్.. శ్రీవిష్ణుల మధ్య మధ్య చాలా ఏళ్ల స్నేహం ఉంది. ఇద్దరూ కెరీర్ ఆరంభంలో డ్యాన్స్ స్కూల్లో స్నేహితులయ్యారు. రోహిత్ స్క్రిప్టుల ఎంపికలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడంటే అందుకు శ్రీవిష్ణు కూడా కారణం. శ్రీవిష్ణు జడ్జిమెంట్ స్కిల్స్ సూపర్ అని.. తనకు కథల ఎంపికలో ఎంతో సాయం చేశాడని రోహిత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘బాహుబలి’ సినిమా రూ.500 కోట్ల స్థాయికి వెళ్తుందని చాలా ముందుగానే శ్రీవిష్ణు గెస్ చేశాడట.
మరో విశేషం ఏంటంటే రోహిత్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోదగ్గ ‘ప్రతినిధి’ ముందు శ్రీవిష్ణు దగ్గరికే వచ్చిందట. అతణ్నే హీరోగా నటించమని దర్శకుడు అడిగితే.. అది నారా రోహిత్ కు అయితే బాగుంటుందని ఆ కథను అతడికి సజెస్ట్ చేసింది శ్రీవిష్ణుయేనట. ఆ సినిమాలో శ్రీవిష్ణు సరదాగా సాగే మరో పాత్రను ఎంచుకున్నాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకునే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ప్రొడ్యూస్ చేసే నిర్మాతల కోసం శ్రీవిష్ణు.. సాగర్ చంద్ర నానా తంటాలు పడుతుంటే రోహిత్ ముందుకొచ్చి ఈ సినిమాను నిర్మించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/