అసలు మహేష్ బాబుకు ఈ 1 మిలియన్ డాలర్ క్లబ్ అనేది పెద్ద కొత్త కాదులే. ఎందుకంటే దాదాపు మనోడి సినిమాలన్నీ ఆ క్లబ్ లోనే ఉంటాయి. ఇప్పటివరకు దూకుడు, ఆగడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. మొదలగు సినిమాలన్నీ 1 మిలియన్ డాలర్ల పైనే వసూలు చేశాయి. అయితే ఈ 1 మిలియన్ క్లబ్ లో చేరడానికి మహేష్ కు ఎంత సమయం పడుతుంది?
ఇప్పటివరకు మహేష్ ఈ క్లబ్ లో చేరాలంటే కనీసం ఓ నాలుగైదు రోజుల టైమ్ తీసుకునేవాడు. కాని శ్రీమంతుడు విషయంలో అంత గ్యాప్ ఇవ్వట్లేదు. ఒక్క ఏటుకే ఆ క్లబ్ లోకి పాస్ సంపాదించేశాడు. అయినా తను క్రియేట్ చేసిన క్లబ్బే కదా, ఎలాగైనా వెళిపోతాడులే. శ్రీమంతుడు సినిమా గురువారం సాయంత్రం ప్రీమియర్లు, శుక్రవారం కలెక్షన్ల తో కలుపుకొని అమెరికాలో ఏకంగా 1.33 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే షుమారు 8+ కోట్లు. గతంలో మనోడు దూకుడు వంటి సినిమాతో లైఫ్ టైమ్ లో 1.58 మిలియన్ డాలర్లు వసూలు చేశాడు. మరి ఇప్పుడేమో కేవలం సింగిల్ డే లో 1.33 మిలియన్ అంటే, ఇక లాంగ్ రన్ లో ఉతికి ఆరేసాడంతే.
ప్రస్తతానికి అమెరికాలో టాప్ గ్రాస్ వసూళ్ళు చూసుకుంటే.. బాహుబలి సినిమా తెలుగు వర్షెన్ 6.87 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ తరువాత అత్తారింటికి దారేది 1.89 మిలియన్ డాలర్ల వసూళ్ళతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఇప్పడున్న ఊపు బట్టి చూస్తే సెకండ్ ప్లేస్ గ్యారంటీ అనిపిస్తోంది.