ఇంకా ఒక్క రోజే... గురువారం ఒక్క రోజు గడిస్తే చాలు.. ఎల్లుండి కల్లా పండగ షురూ. శ్రీమంతుడు సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సినిమా లెంగ్త్ ఎంతో తెలుసా... 163 నిమిషాలు. అంటే రెండు గంటల 43నిమిషాలపాటు మనల్ని అలరించనున్నాడన్నమాట శ్రీమంతుడు. శ్రీమంతుడికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. ఒక్క కట్ కూడా విధించకపోవడం విశేషం.
యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండబట్టే ఇలా జరిగిందని.. లేకపోతే క్లీన్ యూ వచ్చేంత నీటైన కంటెంట్ ఉందని.. సినిమా యూనిట్ వాళ్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇది లేక కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్ లలో మహేష్ సినిమాకి టికెట్ అమ్మకాలు మొదలు పెట్టలేదు. ఇప్పుడు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చేయడంతో... మరో పండగ మొదలైపోయింది. ఇలా సేల్ స్టార్ట్ చేశారో లేదో.. అలా ఫిల్ అయిపోతున్నాయి. ఇప్పటికే మొదటి వీకెండ్ టికెట్స్ ఆల్ మోస్ట్ ఫిలప్ అయిపోయాయని థియేటర్ వాళ్లు చెబ్తున్నారు. 163నిమిషాలంటే... నిడివి కాస్త ఎక్కువే అయినా... అక్కడున్నది మహేష్ కదా... ఎంతసేపున్నా పర్లేదనే అనిపిస్తుంది.