ఫోటో స్టోరీ: మెగా హీరోయిన్.. మెగా ఫ్యాషన్!

Update: 2020-04-13 07:15 GMT
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన మొదటి అమ్మాయి నిహారిక.  అయితే అదేంటో కానీ నిహారిక మూడు సినిమాలలో నటించినా బ్రేక్ మాత్రం దక్కలేదు. పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో టాలీవుడ్ మేకర్స్ నిహారికకు కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలే తప్ప గ్లామర్ డాల్ లాంటి పాత్రలు ఆఫర్ చేయడం లేదు.  ఈ విషయం గ్రహించిందేమో కానీ నీహారిక గత కొంతకాలంగా గ్లామర్ గేర్ వేసేసింది.  

ఈ జెనరేషన్ అమ్మాయి కదా.. అందుకే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల నిత్యం టచ్ లోనే ఉంటుంది.  నిహారిక కొంతకాలం క్రితం ఒక ఫ్యాషనబుల్ ఫోటో షూట్లో పాల్గొంది. ఫోటో షూట్ చేసిన వారు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అభినవ్ సాగర్. ఆయన తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిహారిక ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో నిహారిక ఓ ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో కనిపిస్తుంది. బ్లాక్ టాప్.. బ్లూ ప్యాంట్ ధరించి పైన బ్లూ కలర్ బ్లేజర్ ఊరికే అలా వేసుకుంది.. ఆ కూర్చున్న స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా కావడం ఖాయం. మరో ఫోటోలో బ్లాక్ టాప్ బ్లాక్ ప్యాంట్ ధరించి ఆలివ్ కలర్ జాకెట్ తో యమా స్టైల్ గా నిలుచుంది. ఈ ఫోటోలు చూస్తేనే నిహారిక ఫ్యాషన్ ఏ రేంజ్ లో ఉందో మనకు అర్థమవుతుంది. నార్త్ భామలకు పోటీ అన్నట్టుగా ఒక మోడల్ తరహాలో ఫ్యాషనబుల్ డ్రెస్సులు ధరించి ఫోటోలు ఇలా ఫోజులు ఇవ్వడం సూపర్ అని చెప్పాలి.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ స్పందన దక్కుతోంది.  నిహారిక చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు కానీ వెబ్ సిరీస్ నిర్మాణం చేపట్టాలని.. ఈ తరం ప్రేక్షకులకు నచ్చే వెబ్ సిరీస్ లో నటించాలని నిహారిక ప్లాన్ చేస్తోందట. అంతేకాకుండా మంచి ఆఫర్లు వస్తే సినిమాలకు కూడా సై అంటానని  చెపుతోందట. ఎవరో భాష రాని నార్త్ భామలకు ఇచ్చే బదులు నిహారిక లాంటి తెలుగు అమ్మాయి కి హీరోయిన్ ఆఫర్ ఇస్తే ఎంతో బాగుంటుంది. ఈ దిశగా మన  ఫిలింమేకర్స్ ఆలోచిస్తే మేలు కదా!
Tags:    

Similar News