బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పదేళ్ల క్రితం తనను నానా పటేకర్ లైంగికంగా వేదించాడు అంటూ మీడియా ముందుకు వచ్చి తనూశ్రీ దత్తా దైర్యంగా చెప్పడంతో ఇప్పుడు పలువురు బాలీవుడ్ స్టార్స్ మరియు టెక్నీషియన్స్ తమకు జరిగిన అన్యాయంను, తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలు ఈ విషయమై బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ పై గీతిక త్యాగి అనే అమ్మాయి లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు, కొన్ని సంవత్సరాల క్రితం వీడియోను లీక్ చేసింది. ఆ వీడియోలో సుభాష్ కపూర్ ను ఆయన భార్య ముందే గీతిక చెంప పగుల కొట్టింది. ఇది జరిగి చాలా కాలం అయినా కూడా అప్పుడు గీతిక ఆ విషయాన్ని వెళ్లడి చేసేందుకు ముందుకు రాలేదు. కాని ఇప్పుడు మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి ఆయనపై ఆరోపణలు చేయడంతో పాటు, వీడియోను కూడా లీక్ చేసింది. ఆ ఆరోపణలతో సుభాష్ కపూర్ సినీ కెరీర్ ప్రమాదంలో పడినది.
ప్రస్తుతం సుభాష్ కపూర్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మాణంలో ఒక చిత్రం తెరకెక్కుతుంది. సుభాష్ గురించి ఆ విషయం బయటకు రాగానే వెంటనే అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్‌తో పాటు గుల్షన్ కుమాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్ తప్పుకోగానే, మరో నిర్మాత గుల్షన్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నుండి సుభాష్ కపూర్ ను తప్పిస్తున్నట్లుగా ప్రకటించాడు. కొత్త దర్శకుడితో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. మొత్తానికి మీటూ ఉద్యమం కారణంగా కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలపై ప్రభావం పడుతోంది.