తెలుగులో పెద్ద పెద్ద స్టార్లే ఇంకా తమిళంలోకి అడుగు పెట్టలేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కేవలం నాలుగు సినిమాల అనుభవంతో తమిళంలోకి వెళ్లిపోయాడు. అతడి కొత్త సినిమా ‘నోటా’ ప్రధానంగా తమిళంలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రోమోలు చూస్తే తెలుగు వెర్షన్ సెకండరీ అన్నట్లే ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తెలుగు వెర్షన్ తోనే విజయ్ తమిళనాట మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడికి అక్కడ ఎంతటి క్రేజ్ ఉందో ‘గీత గోవిందం’ రుజువు చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.6.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తమిళనాట తెలుగు సినిమాల్లో నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది. ‘నోటా’కు పాజిటివ్ టాక్ వస్తే విజయ్ తమిళనాట స్టార్ అయిపోతాడనడంలో సందేహం లేదు. ‘నోటా’కు అక్కడ మంచి బజ్ రావడంతో అప్పుడే తమిళంలో మరో సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఐతే ఈసారి విజయ్ సోలో హీరోగా నటించడట. సూర్య కాంబినేషన్లో మల్టీస్టారర్ చేస్తాడట. ‘గురు’ సినిమాతో సత్తా చాటిన లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుందని సమాచారం. సూర్య-సుధ కాంబినేషన్ లో సినిమా గురించి ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఐతే ఇందులో ఓ కీలక పాత్రకు విజయ్ ని తీసుకుంటున్నారట. అది సెకండ్ హీరో స్థాయిలో ఉంటుందట. ఈ చిత్రాన్ని ‘డ్రీమ్ వారియర్స్’ అధినేత ఎస్.ఆర్.ప్రభు నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారి ప్రకటన రాబోతోంది. ఈ చిత్రం తమిళ.. తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. ముందు ‘నోటా’కు పాజిటివ్ టాక్ వచ్చిందంటే తమిళనాట విజయ్ క్రేజ్ మామూలుగా ఉండదు. చూద్దాం మరి శుక్రవారం మార్నింగ్ షో టాక్ ఏంటో?