సుక్కూ.. ఎన్నేళ్లయింది చదువుకుని?

Update: 2016-01-14 04:35 GMT
మామూలుగా ఎగ్జామ్‌ రాసిన వెంటనే చాలామంది చదివిన సబ్జెక్టును మర్చిపోతుంటారు. పోనివ్‌ లెక్చర్లంటే.. ఏదో కాలేజీ మానేసినా ఇంట్లో పిల్లలకు చెప్పడానికి కాస్తో కూస్తో గుర్తు పెట్టుకుంటారేమో కాని.. అసలు పూర్తిగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ లను గుర్తుపెట్టుకొని మరీ రఫ్ఫాడించరు. అదే సుకుమార్‌ విషయానికొస్తే మాత్రం.. మనోడు ఇంటర్నీడియట్‌, ఎంసెట్‌, ఇంజనీరింగ్‌ పుస్తకాలన్నీ తన సినిమాలతో తిరగేయిస్తున్నాడు.

అసలు భూమ్మీద ఒక చోట జరిగే సంఘటనకు.. మరో చోట జరిగిన ఇన్సిడెంట్‌ కారణమంటూ.. థియరీ ఆఫ్‌ డిపెండన్సీ.. రియలిజం.. ఇలా చాలా కలిపి  ''నాన్నకు ప్రేమతో''లో చెప్పాడు. అంతే కాదు.. రిలెటివ్‌ ఫిజిక్స్‌.. కైనమ్యాటిక్స్.. కామన్‌ సెన్స్‌ అప్లికేషన్‌.. అబ్బో తెగ వాడేశాడు. ఒక కాఫీ కప్పును ఏ యాంగిల్‌ లో పట్టుకుంటే దాని మీద పడే సూర్య కిరణం రిఫ్లెక్ట్‌ అయ్యి.. అది ఒక వెయిటర్‌ కంట్లో పడి.. ఆ వెయిటర్‌ గబుక్కున మీ ఎదురుగా ఉన్న అమ్మాయి మీద కాఫీ పారబోసేయపోతే.. అప్పుడు ఆ అమ్మాయి మీ పడుతుందో తెలుసా? సుక్కూ మాత్రం.. సదరు యాంగిల్‌ తో పాటు.. ఆ ఛైన్‌ రియాక్షన్‌ కూడా రొమాంటిక్‌ గా డిజైన్‌ చేసి మరీ వాడుకున్నాడు.

ఇంకో సీన్‌ లో అదేదో ఫోరెన్సిక్‌ సైన్స్‌ స్టూడెంట్‌ లా అనిపించాడు సుక్కూ. ఒక విషానికి యాన్టిడోట్‌ (విరుగుడు) కనిపెట్టమని క్లూస్‌ ఇవ్వడం.. ఆ క్లూస్‌ తెలిసినా ఇవతల హీరో ఏమీ చేయలేని స్థితిని క్రియేట్‌ చేయడం.. అబ్బో అబ్బురపరిచాడు. బటర్‌ ఫ్లయిస్‌.. వాటిని పక్షులు తినడం.. ఈ కాన్సెప్టుతో ఎకోలజీ బ్యాలెన్స్‌ గురించి చెడుగుడు ఆడేసుకున్నాడు. చదువు మానేసి సినిమాల్లోకి వచ్చేసి.. జనరంజక సినిమాలను తీస్తున్న దర్శకులు ఉన్న ఈ రోజుల్లో.. తన చదువునే సినిమాల్లో ఉపయోగించేస్తున్న సుకుమార్‌.. అసలు ఇవన్నీ ఎప్పుడు చదువుకున్నాడు అనిపిస్తోంది ఒక్కోసారి.

1-నేనొక్కడినే సినిమా రిలీజ్‌ అయినప్పుడు అందరూ ఫ్లాప్‌ అన్నారు.. కాని కొన్నాళ్లకు ఆ సినిమాలోని బ్రిలియంట్‌ పాయింట్లను ఫేస్‌ బుక్‌ ఇమేజీలకు తయారు చేసి షేర్లు చేసుకోవడం మొదలెట్టారు. జ్ఞానం వైన్‌ లాంటిది.. తాగినప్పుడు కంటే తాగిన గంటకు బాగా కిక్కెకుతుంది అని త్రివిక్రమ్‌ స్టయిల్లో చెప్పుకోవాలేమో మనం. ఏదేమైనా సుక్కూ సూపర్‌ అంతే.
Tags:    

Similar News