నడి వేసవిలోనే అసలు రచ్చ!!

Update: 2018-03-27 07:54 GMT

ఆల్రెడీ ఎండాకాలం మొదలైపోయింది. వేడి పెరిగిపోయింది. ఇక ఏప్రిల్.. మే నెలలో ఎలా మండుతాయో అని జనం తెగ బెంగ పెట్టేసుకుంటున్నారు. టాలీవుడ్ లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గతవారమే మొదలైన సినిమాల సందడి.. ప్రతీ వారం ఒకట్రెండు కొత్త సినిమాలు అన్నట్లుగా సాగనుంది.

ఇప్పటివరకూ ఏప్రిల్ బాగా ప్యాక్ అయిపోయింది అని అంతా అనుకున్నారు. ఏప్రిల్ 5న చల్ మోహనరంగ.. 12న కృష్ణార్జున యుద్ధం.. 20న భరత్ అనే నేను.. 27న కాలా(డౌట్) షెడ్యూల్ కావడంతో.. అబ్బో పెద్ద సినిమాలు క్యూ కట్టాయ్ అనుకున్నారు. కానీ మే నెలకు వచ్చేసరికి.. ఎండల వేడితో పాటు సినిమాల కౌంట్ కూడా బాగా పెరుగుతోంది. మే నెల 4న నా పేరు సూర్య వస్తుండగా.. 9న మహానటి.. 11న ట్యాక్సీవాలా రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు సాక్ష్యం.. ఆఫీసర్.. వంటి చిత్రాలకు కూడా గతంలోనే డేట్స్ ఇచ్చారు.

 రీసెంట్ గా మెహబూబా.. రాజుగాడు సినిమాలు కూడా మే నెలలోనే వస్తున్నట్లుగా ప్రకటించి డేట్స్ కూడా అనౌన్స్ చేసేశారు. సమ్మర్ రేసులోకి ఇప్పుడు మాస్ మహరాజ్ కూడా వచ్చి చేరాడు. మే 24న నేల టికెట్ విడుదల అుతుందని చెప్పేశాడు. ఇవి మాత్రమే కాకుండా.. మరో అరడజన్ సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకోవాలన్నది వీరి తపన. నడి వేసవిలో తెలుగు సినిమాల రచ్చ మాత్రం ఖాయం అయిపోతోంది.


Tags:    

Similar News