క్రాస్ రోడ్స్ లో యూత్ హీరో

Update: 2018-12-09 01:30 GMT
ఇప్పుడున్న పరిస్థితిలో బ్యాక్ గ్రౌండ్ ఎంత సపోర్ట్ చేసినా సక్సెస్ లేకపోతే త్వరగా కనుమరుగయ్యే  ప్రమాదం ముఖ్యంగా కుర్ర హీరోలకు ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు పరాజయాలు అంటే ప్రేక్షకులు క్షమిస్తారు కానీ వాటినే నిత్యకృత్యంగా పెట్టుకుంటే సారి బాస్ అంటారు. సందీప్ కిషన్ కు ఇది వ్యక్తిగతంగా అనుభవమవుతోంది. నిన్న విడుదలైన నాలుగు సినిమాల్లో దారుణమైన ఫీడ్ బ్యాక్ తో హాఫ్ రేటింగ్ తో షాక్ ఇచ్చింది నెక్స్ట్ ఏంటి. మిల్కీ బ్యూటీ తమన్నా ఫనా లాంటి క్లాసిక్ తీసిన కునాల్ కోహ్లీ దర్శకత్వం ఇవేవీ ఇంచు కూడా కాపాడలేక పోయాయి. దానికి తోడు పబ్లిసిటి కూడా అంతంతమాత్రంగానే చేయడంతో అసలు ఇది వచ్చిందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు.

అదలా ఉంచితే సందీప్ కిషన్ ఫిల్మోగ్రఫీలో మరో డిజాస్టర్ అయ్యింది. సోమవారం తర్వాత ఇది థియేటర్లలో ఉంటే గొప్పే అన్నది ట్రేడ్ టాక్. నెక్స్ట్ ఏంటికి వచ్చిన మైనసుల్లో కునాల్ కోహ్లీ టేకింగ్ తో పాటు సందీప్ కిషన్ పేరు కూడా హైలైట్ కావడం కుర్రాడిని ఇంకా బాధించే విషయం. సందీప్ కిషన్ తన కెరీర్ లో నెక్స్ట్ ఏంటి అని ప్రశ్నించుకునే సమయం వచ్చేసింది. ఈ ఏడాది చేసిన మనసుకు నచ్చింది-నెక్స్ట్ ఏంటి రెండూ పోటీ పడి మరీ వెనక్కు తన్నాయి. ఛోటా కె నాయుడు ఎంత పుష్ చేస్తున్నా సరైన కథ పడక సందీప్ మార్కెట్ జీరో నుంచి ఇంకా కిందకు వెళ్తోంది.

తరువాత సినిమాలు ఉన్నాయా లేవా అనే క్లారిటి కూడా లేదు. ఆ మధ్య తమిళ్ లో రెండు సినిమాలు ఓ మోస్తరుగా ఆడితే అక్కడే కాస్త గట్టిగా ట్రయ్ చేయొచ్చు అనుకున్నాడు. అయితే కేరాఫ్ సూర్యతో అక్కడా బ్యాడ్ టైం పిలిచి మరీ కౌగిలించుకుంది. చెప్పుకోవడానికి ఒక్క వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తప్ప ఇంకే హిట్టు లేని సందీప్ కిషన్ కాస్త చెప్పుకోదగిన శమంతకమణి కూడా గుంపులో గోవిందా బ్యాచే. సో నెక్స్ట్ ఏంటి అని ప్రశ్నకు సందీప్ కిషన్ దగ్గరైనా సమాధానం ఉందో లేదో.
Tags:    

Similar News