సాధారణంగా తెరపై వీరోచిత్ర కార్యాలను చేసేవాళ్లని హీరోలంటారు. అదే బయట అయితే వీరోచిత నిర్ణయాలను తీసుకుని ధైర్యంగా ముందడుగు వేసేవారిని హీరోలంటారు. అలా చూసుకుంటే తెరపైనే కాదు .. బయట కూడా సూపర్ స్టార్ కృష్ణనే.
'తేనె మనసులు' నుంచి చూసుకుంటే సినిమా .. సినిమాకి కృష్ణలో వచ్చిన మార్పు కనిపిస్తుంది. తనని తాను మలచుకుంటూ .. అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ వచ్చిన తీరు కనిస్తుంది. లుక్ పరంగా ... నటన పరంగా ఆయన ఎప్పటికప్పుడు బెటర్మెంట్ చూపిస్తూ వచ్చారు.
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు ఎవరి దారిలో వారు ముందుకు వెళుతుంటే, జేమ్స్ బాండ్ సినిమాలను ఆయన తెలుగు తెరకు తీసుకుని వచ్చారు. ఫస్టు 70 MM మూవీ .. ఫస్టు సినిమా స్కోప్ లను టాలీవుడ్ కి పరిచయం చేశారు.
పద్మాలయ స్టూడి యోస్ బ్యానర్ పై భారీ చిత్రాలను నిర్మించి సంచలన విజయాలను అందుకున్నారు. ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాలలో నటించిన కథానాయకుడిగా కొత్త రికార్డును క్రియేట్ చేశారు. అలాంటి కృష్ణ ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు కావడంతో, కూతురు మంజుల తన యూ ట్యూబ్ ఛానల్ కోసం ఆయనను ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. కృష్ణ మాట్లాడుతూ .. "ఈ కలర్ నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. చదువు అయిపోయిన తరువాత నేను ఏ ఉద్యోగం చేయలేదు.
నేను సినిమా హీరోను అవుతాననే ఇంట్లో వాళ్లతో చెప్పేవాడిని. అనుకున్నట్టుగానే నేను హీరోనయ్యాను. 'గూఢచారి 116' సినిమా కి నన్ను తీసుకుని నాకు అడ్వాన్స్ ఇచ్చిన మొత్తం వెయ్యి రూపాయలు. నాకు పిల్లలంటే ఇష్టం .. అందువల్లనే నేను ఫ్యామిలీ లైఫ్ ను మిస్ కాలేదు.
నిన్ను హీరోయిన్ గా చేద్దామని అనుకుంటే ఆంధ్రలో ఉన్న అభిమానులు నానా గొడవా చేశారు. అందువలన కుదరలేదు.
ఇక మహేశ్ ను హీరోను చేయడమనేది .. ముందుగా ప్లాన్ చేసుకుని చేసింది కాదు. ఒకసారి షూటింగు చూడటానికి నాతో పాటు వచ్చాడు. షూటింగు జరుగుతుంటే దూరంగా కూర్చుని చూస్తున్నాడు.
'నువ్వు యాక్ట్ చేస్తావా లేదా?' అని అడిగితే .. 'నేను చేయను .. నేను చేయను' అంటూ స్టూడియో మొత్తం పరిగెత్తించాడు. ఇక ఒకానోక దశలో నేను చేసిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక నేను పనికిరానని చెప్పి హీరోగా బుక్ చేయడం మానేశారు. అప్పుడు సొంత బ్యానర్లో 'పాడి పంటలు' తీయడంతో తిరిగి నిలదొక్కుకోవడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు. ఈ నెల 31వ తేదీన పూర్తి ఎపిసోడ్ పలకరించనుంది.