ఈ మధ్యకాలంలో సినిమాలను నిర్మించడం మానేశాడు సురేష్ బాబు. వేరే ఊళ్ళో హిట్టయిన సినిమా రైట్స్ కొని రీమేకులు మాత్రమే చేస్తున్నాడు. ఆ విధంగా మసాలా - దృశ్యం - గోపాలా గోపాలా వంటి సినిమాలను చేశాడు. అయితే ఏదన్నా సినిమా నచ్చితే మాత్రం ప్రెజంట్స్ అంటూ వేసుకుని తనే డిస్ర్టిబ్యూట్ చేశాడు. అదిగో మధుర శ్రీధర్ తో కలసి పెళ్ళిచూపులు సినిమాను అలాగే కొనుక్కున్నాడు.
అయితే చాన్నాళ్ళ తరువాత సురేష్ బాబు డైరక్టుగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడంటే అందరికీ షాకింగ్ గానే ఉంది. అదిగో ఇప్పుడు కొడుకు రానా దగ్గుబాటితో తొలి సినిమాను తీస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. అసలు ఏం చూసి ఈ సినిమాను తనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ మధ్యన తీసిన సినిమాలన్నింటిలోనూ హీరోయిన్ బడ్జెట్ ను విపరీతంగా కట్ చేసి.. ఫామ్ లో లేని శ్రీయ - మీనా - అంజలి వంటి భామలను తీసుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం కాజల్ ను దించేశారు. మినిమం 2 కోట్లు లేకుండా ఈ భామ చేసుండదని అందరికీ తెలుసు. అంటే ఈ సినిమాలో ఏమున్నట్లు?
ఎందుకో తెలియదు కాని.. గతంలో ఎన్నడూ లేనంత కాన్ఫిడెంటుగా ఇప్పుడు దర్శకుడు తేజ చెప్పిన కథను సురేష్ బాబు నమ్మారట. ఎట్టి పరిస్థితుల్లో సినిమా హిట్టవుతుందని ఈ టీమ్ నమ్ముతుంది. ఆ విధంగా సురేష్ తన కొడుక్కి హీరోగా తొలి హిట్టును అందిస్తారేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/