అంతర్జాతీయ స్థాయి 'బిలీవ్‌' తో ఎస్పీ మ్యూజిక్ ఒప్పందం

Update: 2021-07-27 14:30 GMT
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుండి మరో కొత్త వెంచర్‌ ఇటీవలే మొదలు అయిన విషయం తెల్సిందే. ఎస్పీ మ్యూజిక్ పేరుతో మ్యూజిక్‌ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేష్ తారా చిత్రం 'నారప్ప' ఆడియోను ఎస్పీ మ్యూజిక్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా ఎస్పీ మ్యూజిక్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బిలీవ్‌ మ్యూజిక్ కంపెనీ తోడు అయ్యింది. ఎస్పీ మరియు బిలీవ్ ల కాంబినేషన్‌ లో నారప్ప సినిమా పాటలు సంగీత ప్రపంచంలోకి విడుదల అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా బిలీవ్‌ కంపెనీకి అత్యున్నత గౌరవం ఉంది. ఇండియాలో కూడా చాలా కాలంగా బిలీవ్‌ కు మార్కెట్‌ ఉంది.

ఇప్పుడు సౌత్‌ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ఎస్పీ మ్యూజిక్ వారితో జత కట్టేందుకు సిద్దం అయ్యింది. ఆరంభం అయిన అతి తక్కువ సమయంలోనే సురేష్‌ ప్రొడక్షన్స్ వారి ఎస్పీ మ్యూజిక్ సంస్థకు అంత పెద్ద సంస్థతో భాగస్వామ్యం దక్కడం నిజంగా చాలా పెద్ద విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటూ ఉన్నారు. తాజాగా ఎస్పీ మ్యూజిక్ ఎండీ సురేష్‌ బాబు మరియు.. బిలీవ్‌ మ్యూజిక్‌ ఇండియా ఎండీ వివేక్‌ రైనా భేటీ అయ్యారు. ఈ విషయమై వీరిద్దరు పలు విషయాలపై చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ బిలీవ్ తో భాగస్వామి అవడం ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్ కు ఉన్న ప్రపంచ స్థాయి నెట్ వర్క్ తో ఎస్ పి మ్యూజిక్ లేబుల్ వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ లవర్స్ కు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. నారప్ప తో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నాం అన్నారు. వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్ తో భాగస్వామి అవడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారప్ప మూవీ మా పార్టనర్ షిప్ లో ఫస్ట్ మూవీగా తీసుకున్నాం. బిలీవ్ కంపెనీ ద్వారా మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు డిజిటల్ పార్టనర్స్ కు ఇన్నోవేటివ్ మార్కెటింగ్, ఆడియెన్స్ గ్రోత్ వంటి అంశాల్లో సహకారం అందిస్తామని పేర్కొన్నాడు.
Tags:    

Similar News