కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాను నిర్మించే సినిమాలతో పాటుగా నటించే చిత్రాలను కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశాడు. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ థియేటర్ యాజమాన్యాలు సూర్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో ఓటీటీలకే మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నా కూడా తాను నటిస్తున్న ''జై భీమ్'' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డిజిటల్ వేదికల్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు సూర్య.
టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ''జై భీమ్'' చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు ఈరోజు గురువారం అధికారికంగా ప్రకటించారు. నవంబర్ నెలలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ వంటి నాలుగు దక్షిణాది భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య నిర్మిస్తున్నారు. అణగారిన వర్గాలు, గిరిజన తెగల హక్కులు మరియు వారి సమస్యలపై పోరాడే పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో సూర్య కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన 'జై భీమ్' ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రంలో సూర్య సరసన 'కర్ణన్' ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ ఆర్ కాథిర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సూర్య కెరీర్ లో మొదటిసారి నల్లకోటు ధరిస్తున్న 'జై భీమ్' చిత్రం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.