#సుశాంత్.. వామ్మో! రియా ఫోన్ ని క్లోన్ చేసి ట్యాప్ చేశారా!?

Update: 2020-09-05 10:10 GMT
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి మెడ‌కు పూర్తిగా ఉచ్చు బిగుసుకుంది. ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి . సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను పోలీసులు అరెస్టు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం వీరిని వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు. తరువాత వారిని కోర్టుకు తీసుకువెళతారు. రియాను కూడా త్వరలోనే అరెస్టు చేయవచ్చని స‌మాచారం.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. కేంద్ర ఏజెన్సీలు ఇదివ‌ర‌కే రియా ఫోన్ ‌ను క్లోన్ చేశాయని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. సెంట్రల్ ఏజెన్సీలు రియా ఫోన్ ను క్లోన్ చేశాయి. ఆమె స్పష్టంగా ``న్‌డిపిఎస్ చట్టం ప్రకారం నిషేధించబ‌డిన‌వి కొనుగోలు చేయడం.. అమ్మడం వంటి వాటిలో ప్రమేయం క‌లిగి ఉంది`` అని నార్కోటిక్స్ బృందాలు నిజాన్ని నిగ్గు తేల్చాయ‌ట‌.

నిన్న షోయిక్ చక్రవర్తి .. శామ్యూల్ మిరాండాలను ఎన్‌.సి.బి వాళ్లు వారి నివాసాల వద్ద శోధించిన తరువాత అరెస్టు చేశారు. సోదరి రియా సూచనల మేరకు తాను డ్రగ్స్ సేకరించానని షోయిక్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శామ్యూల్ మిరాండా కూడా ఈ విషయంలో రియా ప్ర‌మేయాన్ని ఒప్పుకున్నాడు. గత రాత్రి ఎన్‌సిబికి చెందిన డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, ``మేము షోయిక్ .. శామ్యూల్ మిరాండా కుటుంబానికి సమాచారం ఇచ్చాము. ఇద్దరూ ఎన్‌.డిపిఎస్ చట్టంలోని అనేక విభాగాల కింద అరెస్టు అయ్యారు`` అని వెల్ల‌డించారు.

అంతకుముందు ముంబైలో పనిచేస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను ఎన్‌.సిబి అరెస్టు చేసినప్పుడు జైద్ విలాత్రా- అబ్దేల్ బాసిత్ పరిహార్ వంటి వాళ్లు విచారణలో షోయిక్ - మిరాండా పేరును వెల్లడించారు. అలాగే షోయిక్ వాట్సాప్ చాట్లు బ‌య‌ట‌ప‌డ్డాక అతను శామ్యూల్ మిరాండాతో పెడ్ల‌ర్ విలాట్రా  కాంటాక్ట్ నంబర్ ను పంచుకున్నాడని 5 గ్రాముల మాద‌క‌ద్ర‌వ్యాలకు రూ .10వేలు చెల్లించాలని కోరాడు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సోదరునితో పాటు రియా అరెస్టు ఖాయ‌మైన‌ట్టేన‌ని తాజా నివేదిక‌లు చెబుతున్నాయి.
Tags:    

Similar News