ఏదైనా సంచలనం చోటు చేసుకుంటే దానిపై మీడియాలో భారీ ఎత్తున కవర్ కావటం.. ఆ అంశానికి ఇచ్చే ప్రాధాన్యత భారీగా ఉంటుది. ఇక.. సంచలన ఉదంతం సెలబ్రిటీలతో ముడిపడి ఉంటే.. మరెంత రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక.. మీడియా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే.. వెనుకా ముందు చూసుకోకుండా పోస్టుల మీద పోస్టులు చేస్తున్న సోషల్ మీడియా చెలరేగిపోతున్న వేళ.. తాము సైతం తక్కువ కాదన్నట్లుగా ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం గడిచిన కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్న వేళ.. మరికొంత కాలం ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా వచ్చేట్లుగా కనిపిస్తోంది. తాజాగా సుశాంత్ ప్రేయసి రియాకు డ్రగ్స్ డీలర్స్ కు సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించటం.. ఆ దిశగా విచారణ సాగటమే కాదు.. ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగ ప్రవేశంతో సీన్ మరింత సంచలనంగా మారింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి వచ్చిన రియా చక్రవర్తి విషయంలో.. అక్కడి మీడియా వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో రియా ఫ్రేమ్ కోసం.. ఆమె మాటల కోసం మీడియా ప్రతినిధులు హద్దులు దాటేశారు. ఒక దశలో ఆమెను తోసేసినట్లుగా చోటు చేసుకున్న ఉదంతం.. చూసేందుకు ఆమెపై మీడియా దాడి చేసినట్లుగా ఉందన్న భావన కలగటం ఖాయం.
మీడియా తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి జతగా తాజాగా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. మీడియా తీరును తప్పు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని ప్రోటోకాల్ ను మీడియా ప్రతినిధులు ఉల్లంఘించారని.. వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. భౌతిక దూరాన్ని పాటించాల్సిన వేళ.. అలాంటివేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. మోబింగ్ చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నార్కోటిక్ కార్యాలయం వద్దకు విచారణకు హాజరైన రియా విషయంలో మీడియా వ్యవహరించిన తీరుపై ప్రముఖ సినీ నటి తాప్సీ తప్పు పట్టారు. న్యాయం పేరిట దోషిగా నిరూపణ కాకముందే.. ఒక మనిషి జీవించే హక్కును కోల్పోతున్నాడన్న ఆమె.. కర్మలు ప్రతి మానవుడి అడ్రస్ లను కనుగొంటాయన్నారు. మీడియా తీరు సిగ్గుపడేలా ఉందని స్వర భాస్కర్ విరుచుకుపడితే.. ముంబయిలో శాంతిభద్రతలపై మీడియా శక్తి ఎక్కువైందని.. దీనికి ఏ పేరు పెట్టినా పిలిచినా ఘోరమే అవుతుందని.. అనుభవ్ సిన్హా వ్యాఖ్యానించారు.
విచారణకు హాజరైన రియా విషయంలో మీడియా వ్యవహరించిన తీరు ఖండించేలా ఉందన్నారు. మీడియా ఎందుకు రాబందుల్లా ప్రవర్తిస్తోంది? దయచేసి ఆమెకు అవసరమైన స్పేస్ ఇవ్వాల్సిందిగా ప్రముఖ నటి దియా మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. రియాను.. ఆమె కటుుంబాన్ని అమానుషంగా చూపటం ఆపాలన్నారు. బాలీవుడ్ నిర్మాత అలంకృత శ్రీవాస్తవ మరో అడుగు ముందుకేసి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ గురించి కానీ.. కరోనా మహమ్మారి సమస్య మీద ఆలోచనలు వెళ్లటం లేదని.. రియాను పణంగా పెట్టటానికి మాత్రమే ఆసక్తి చూపటం ఏమిటని ప్రశ్నించారు. రియా అంశమే దేశ ప్రజల్ని ఎక్కువగా సంతోషపరుస్తుందోనంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే.. రియా ఎపిసోడ్ పై మీడియా తీరుపై సోషల్ మీడియాతో పాటుగా.. సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెప్పక తప్పదు.