మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్రిటీష్ వారిపై దండయాత్రను చేసిన రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఇప్పుడు ''సైరా నరసింహారెడ్డి'' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటీనటులు ఎవరెవ్వరు ఉండబోతున్నారు అనే సందేహం ఎప్పటినుండో ఉంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారో చెప్పేశారు. మొత్తానికి హేమాహేమీలు అందరూ రంగంలోకి దూకేశారు.
మెగాస్టార్ చిరంజీవి తరువాత ఈ సినిమాలో అతి పెద్ద పేరు.. బాలీవుడ్ షెహేన్షా అమితాబ్ బచ్చన్ దే. అలాగే విలన్ గా మారిన మన హీరో జగపతి బాబు.. ఈగ సినిమాతో అలరించిన కన్నడ హీరో సుదీప్.. అందాల హీరోయిన్ నయనతారతో పాటు.. ప్రస్తుతం తమిళ సినిమాను షేక్ చేస్తున్న హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఉన్నాడు. వీళ్లందరూ ఈ సినిమాకు భారీ క్యాస్టింగ్ మాత్రమే కాదు.. భారీ పిల్లర్లు కూడా. వీరి రాకతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు రేంజు మెగా స్థాయికి పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా వీరందరూ ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం..లో రిలీజ్ చేయడానికి బాగా ఉపయోగపడతారు. పైగా అందరూ కూడా ప్రూవ్ చేసుకున్న నటులే. మొత్తానికి రామ్ చరణ్ భలే భలే క్యాస్టింగ్ సెట్ చేశాడనే చెప్పాలి.
ఇక టెక్నీషియన్లు విషయానికొస్తే.. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్.. సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్.. వీళ్ళందరూ తలలు పండిన నిష్ణాతులు. ఇప్పటివరకు ఈ తరహా సినిమాను హ్యాండిల్ చేయని సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి. అద్భుతమైన నటులు.. అదిరిపోయే టెక్నీషియన్లు.. పక్కనే మెగాస్టార్.. చూద్దాం 'సైరా' ఎలా ఉండబోతుందో!!
Full View