సైరా ప్రీరిలీజ్ బిజినెస్.. అస‌లు లెక్కలివి

Update: 2019-10-01 05:36 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన పాన్ ఇండియా చిత్రం `సైరా- న‌ర‌సింహారెడ్డి` తెలుగు-త‌మిళం-హిందీ-మ‌లయాళం-క‌న్న‌డ భాష‌ల్లో అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. దాదాపు 270 కోట్లు వెచ్చించామ‌ని కొణిదెల కంపెనీ వ‌ర్గాలు ప్ర‌చారం సాగించాయి. 150 కోట్ల ప్రీబిజినెస్ తో టాప్ 3 స్థానంలో నిలిచింద‌ని తెలుస్తోంది. బిజినెస్ ప‌రంగా బాహుబ‌లి- సాహో త‌ర్వాత సైరా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాలు-క‌ర్నాట‌క‌-ఓవ‌ర్సీస్ లో బిజినెస్ పూర్త‌యింది. అయితే ఉత్త‌ర భార‌త‌దేశం-త‌మిళ‌నాడు-కేర‌ళ‌లో సొంత రిలీజ్ చేస్తున్నారు. ఏరియా వైజ్ వాస్త‌వ లెక్క‌లు ప‌రిశీలిస్తే....

ఎన్.ఆర్.ఏ (నాన్ రిఫండ‌బుల్) బేసిస్ బిజినెస్ వివ‌రాలు ఏరియా వైజ్ ప‌రిశీలిస్తే... నైజాం 30 కోట్లు.. సీడెడ్ 20కోట్లు.. ఉత్త‌రాంధ్ర‌-14.40కోట్లు.. నెల్లూరు 4.80కోట్లు.. కృష్ణా 9 కోట్లు.. గుంటూరు 11.50 కోట్లు.. ఈస్ట్ గోదావరి 9.80కోట్లు.. ప‌శ్చిమ‌ గోదావరి 8.40కోట్లు.. మొత్తం ఆంధ్రా తెలంగాణా 107.90 కోట్ల మేర (ఎన్.ఆర్.ఏ) బిజినెస్ సాగింది. కర్ణాటక 27కోట్లు (ఔట్ రైట్).. తమిళనాడు -కేరళ -ఉత్త‌ర భార‌త‌దేశంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ సొంతంగా రిలీజ్ చేస్తోంది. విదేశాల్లో 18కోట్ల బిజినెస్(ఔట్ రైట్.. ఖ‌ర్చులు క‌లిపి) చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బిజినెస్ సుమారు 152.90 కోట్ల మేర బిజినెస్ సాగింది. ఔట్ రైట్ ఓవ‌రాల్ గా అన్ని ఖ‌ర్చులు క‌లుపుకుని అని అర్థం. వాస్త‌వానికి ఉత్త‌రాంధ్రా క‌లుపుకుని 200కోట్ల ప్ర‌పంచ‌వ్యాప్త బిజినెస్ అంటూ ప్ర‌చారం సాగింది. కానీ బిజినెస్ చేసింది 153కోట్లు మాత్ర‌మే. సొంత రిలీజ్ ఇందులో ఇంక్లూడ్ చేయ‌లేం.

ట్రేడ్ నిపుణుల లెక్కల  ప్ర‌కారం.. 250కోట్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా వ‌సూలు చేయాల‌ని అంచ‌నా వేస్తున్నారు. 160 కోట్ల షేర్ లోపు అయితే ఫ్లాప్ అంటూ ర‌క‌ర‌కాలుగా విశ్లేషించిన సంగ‌తి తెలిసిందే. అన్ని భాష‌ల స్టార్లు న‌టించిన ఈ సినిమాకి ట్రైల‌ర్ల‌తో క్రేజు పెరిగింది. అయితే క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎలా ఉంటుంది అన్న‌ది వేచి చూడాలి.


Tags:    

Similar News