తమ్మూ తమిళంలోనే సెటిలైపోతుందా?

Update: 2015-01-20 07:00 GMT
తమన్నా సినీ ప్రస్థానం చాలా భిన్నమైంది. ముందుగా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె తొలి సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తమిళంలోకి వెళ్లి అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ మంచి ఫలితమే వచ్చింది. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకున్నాక.. మళ్లీ తెలుగులోకి వచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లోనూ రెండు మూడు రాళ్లేసి వచ్చింది. ఐతే అక్కడ, తెలుగులో వరుసగా పరాజయాలు పలకరించేసరికి మళ్లీ ఇప్పుడు తమిళం వైపు చూస్తోంది.

ఈ మధ్యే ఆర్యతో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన తమన్నా.. కొన్నాళ్లుగా షూటింగ్‌లోనూ పాల్గంటోంది. ఐతే ఆ సినిమా షూటింగ్‌ మొదలైన కొన్ని రోజుల తర్వాత ఓ ఆడియో ఫంక్షన్లో తమన్నాను చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఉన్నట్లుండి ఆమె బరువు పెరిగిపోవడమే దీనికి కారణం. బాహుబలి కోసం ఐదారు కిలోలు బరువు తగ్గిన తమ్మూ.. ఆ లాస్‌ను భర్తీ చేయడమే కాదు.. దాన్ని దాటి కూడా కొన్ని కిలోలు బరువు పెరిగింది. తమిళం వాళ్లకు బద్దుగా ఉండే హీరోయిన్లంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడైతే చెల్లిపోయింది కానీ.. సెకండ్‌ ఇన్నింగ్సులోనూ ముందులాగే స్లిమ్ముగా ఉంటే లాభం లేదని అనుకుందో.. లేక క్యారెక్టర్‌ డిమాండ్‌ చేసిందో కానీ.. మొత్తానికి బరువు పెరిగిన తమ్మూను చూసి ఈమె ఇక కోలీవుడ్‌లోనే సెటిలవ్వాలని అనుకుంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

Tags:    

Similar News