ఎన్.టి.ఆర్ కి ఎదురుతిరిగిన ఒకే ఒక్క హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఎన్.టి.ఆర్ టీడీపీ ప్రభుత్వం పై సెటైర్ వేస్తూ పద్మాలయ స్టూడియోస్ లో సినిమాలు తీశారు కృష్ణ. ఆ టైం లో టీడీపీ శ్రేణులు కృష్ణ మీద పగ పెంచుకున్నారు. 1985లో మోసగాళ్లకు మోసగాడు సినిమా షూటింగ్ కోసం నంధ్యాల వెళ్లారు కృష్ణ.
నంధ్యాలలో రైల్వే ఫారెస్ట్ బ్రిడ్జ్ మీద ఆ సినిమా షూటింగ్ నిర్వహించారు. అదే టైం లో కర్ణూలు జిల్లాలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కృష్ణ.
రాత్రి 11 గంటలకు ప్రచారం ముగించుకుని కర్నూలు చేరుకునే టైం లో టీడీపీ శ్రేణులు కృష్ణ మీద రాళ్ల దాడి చేశారు. ఆ దాడిలో కృష్ణ కంటికి గాయమైంది. అక్కడే ప్రభుత్వ హాస్పిటల్ లో కంటికి కట్టు చేయించుకుని మరీ తర్వాత జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు కృష్ణ. అర్ధరాత్రి వరకు ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చే వారు.
ఆయన సినిమాలతో అభిమానిగా మారినా ఆయన చేస్తున్న మంచి పనుల వల్ల అభిమానులు ఆయన్ని మరింత ఇష్టపడ్డారు. పరిశ్రమలో ఎవరిని నొప్పించకుండా ఎవరేమని అన్నా సరే పెద్దగా పట్టించుకోకుండా ఉన్నారు కృష్ణ. హీరోగానే కాదు దర్శకుడిగా.. నిర్మాతగా కృష్ణ చేసిన ప్రయోగాలు అన్ని తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లాయి.
ఎన్.టి.ఆర్ తన అభిమాన నటుడు అయినా సరే ఆయన రాజకీయ అంశాలపై మాత్రం కృష్ణ వ్యతిరేకిస్తూ వచ్చారు. సినిమాల ద్వారా ఎన్.టి.ఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కొంత టైం పాటు ఎన్.టి.ఆర్, కృష్ణ మాటలు లేకున్నా మళ్లీ ఇద్దరు కలిశారు. ప్రస్తుతం నందమూరి వారసులు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ లు ఘట్టమనేని ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటున్నారు. మహేష్ అంటే బాలకృష్ణకి ప్రత్యేకమైన అభిమానమని అప్పట్లో చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.