సహజంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తేనో.. లేక సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటేనో తప్ప ప్రేక్షకులు చిన్న సినిమాలపై దృష్టి సారించరు. సాహో హడావుడి కాస్త తగ్గింది కదా.. దీంతో ఈ శుక్రవారం నాడు దాదాపు అరడజను చిన్న సినిమాలు విడుదలయ్యాయి. మరి వాటి పరిస్థితి ఎలా ఉంది?
'జోడి'.. '2 అవర్స్ లవ్'.. 'దర్పణం'.. 'నీకోసం'.. 'ఉండిపోరాదే'.. ఇవండీ ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు. వీటిలో మెజారిటీ ప్రేక్షకులకు కొద్దో గొప్పో తెలిసిన సినిమా మొదటిదే. సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రం. మొదటి నుంచి ఈ సినిమాపై బజ్ లేదు.. రిలీజ్ తర్వాత సినిమాను రోటీన్ స్టఫ్ అని తేల్చేశారు. ఇక మిగతా సినిమాల పరిస్థితి మరీ అగమ్యగోచరం అన్నట్టుంది. అసలు అలాంటి సినిమాలు ఉన్నాయని ప్రేక్షకులకు తెలుసా? మెజారిటీ తెలుగు ప్రేక్షకులు ఆ టైటిల్స్ ను విని ఉంటారనుకోవడం కూడా పొరపాటే. సినిమా బాగుండడం.. బాగాలేకపోవడం పక్కన పెట్టండి.. అసలు ప్రేక్షకులకు ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలియకపోతే థియేటర్లకు ఎలా వెళ్తారు? దీనర్థం ప్రమోషన్స్ సరిగా లేవనే.
అలా లాజిక్ చెప్తే.. "అసలే చిన్న సినిమాలు.. ప్రమోషన్స్ అదనపు ఖర్చు కదా" అనుకోవచ్చు. మరి సోషల్ మీడియా ఉంది కదా? పైసా ఖర్చు పెట్టకుండా ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అనే అంశాన్ని రామ్ గోపాల్ వర్మ లాంటి గురువులు ఏళ్ళ తరబడీ నేర్పిస్తున్నారు కదా. ఎంతసేపూ అయనలోని నెగెటివ్ కోణాలను చూడడం తప్ప.. అయన తన సినిమాలకు ప్రమోషన్స్ చేసే టెక్నిక్ ను.. ప్రేక్షకుల వద్దకు తన సినిమాలను తీసుకెళ్ళే విధానాన్ని నేర్చుకోకపోతే ఎలా?
సరే.. ఈవారం సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా? ఈ సినిమాల పరిస్థితి ఏంటి.. అంటే ఒక్క సినిమాకు కూడా 'బాగుంది' అనే టాక్ రాలేదు. ఎక్కడా సోషల్ మీడియాలో కనీసం చర్చ కూడా లేదు. నిజాలు చెప్తే చాలామంది ఫీల్ అవుతారు కానీ ఇలాంటి చిన్న సినిమాల గురించి గమనించాల్సిన మరో విషయం ఏంటంటే అసలు ఎక్కడా వీటికి రివ్యూలు కూడా రావు. ఒకటీ అరా సైట్స్ లో మాత్రం వస్తాయి. అందుకు ముఖ్య కారణం ఏంటో తెలుసా.. రివ్యూయర్లకు ఫ్రీ టికెట్ ఇచి.. ఫీజు ఇచ్చిమరీ వెళ్ళమని చెప్పినా వాళ్ళు 'వద్దు బాబోయ్' అని దండం పెడతారు.
ఇది చిన్న సినిమాలను తక్కువ చేయడం కాదు.. ఆరగదీసి ఇరగదీసిన కథలతో క్వాలిటీ లేని సినిమాలు తీయడం కంటే మంచి కంటెంట్ ను నమ్ముకుని.. సరైన రూట్లో ప్రమోషన్స్ చేస్తే ప్రేక్షకుల దృష్టిలో పడతారు. సినిమా ఫలితం అటూ ఇటూ అయిన కనీసం ఆ సినిమాలను యూట్యూబ్ లో అయినా ప్రేక్షకులు చూస్తారు. దాంతో సినిమాకు పనిచేసిన వారికి గుర్తింపు అయినా వస్తుంది.వారు పనిచేసే నెక్స్ట్ సినిమాకు అది ఉపయోగపడుతుంది. అసలు రిలీజ్ అయిన సంగతే ప్రేక్షకులకు తెలియకపోతే వారు యూట్యూబ్ లో అయినా ఎలా చూస్తారు? చిన్న సినిమాల ఫిలిం మేకర్లు ఈ విషయంపై నిజంగానే ఆలోచించాలి.