సిగ‌రెట్లు వెలిగించేది కాదు.. దీపాలు వెలిగించేది!-థ‌మ‌న్

Update: 2021-04-05 10:30 GMT
``వకీల్ సాబ్ సిగరెట్ల్ వెలిగించుకునే సినిమా కాదు .. ఇంట్లో దీపాలు వెలిగించే సినిమా. ఇది 126 సినిమాల వెయిటింగ్. 20 ఏళ్లు వేచి చూసిన కల. నాకు సంగీతం ఇచ్చేందుకు రెండున్నర గంటల వ‌కీల్ సాబ్  సరిపోలేదు`` అని అన్నారు సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.థ‌మ‌న్. ప‌వ‌న్ క‌ల్యాణ్ - శ్రీ‌రామ్ ఆదిత్య‌- దిల్ రాజు కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ వేదిక‌పై థ‌మ‌న్ మాట్లాడుతూ పైవిధంగా ఎమోష‌న‌ల్ అయ్యారు.

థమన్ మాట్లాడుతూ..``ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గారి సినిమాకి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. పవన్ జీపై నాకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ.. కసి.. ఎమోషన్ అంతా కీబోర్డ్ పైన‌ చూపిస్తాను`` అని అన్నారు. గత 36 రోజులుగా నేను నా టీమ్ సరిగ్గా నిద్రపోకుండా పనిచేసాం. థియేటర్లో మీరు రెప్పవాల్చకుండా సినిమా చూస్తారనే హామీ ఇస్తున్నా. వకీల్ సాబ్ అనుభ‌వాన్ని మర్చిపోలేను... మా అమ్మను తీసుకెళ్లి గర్వంగా చూపించే సినిమా ఇది అని అన్నారు

రాజ‌కీయాల్లోకి చేరిన‌ప్పుడు ప‌వ‌న్ గారి తొలి స్పీచ్ ఇంకా మ‌ర్చిపోలేదు. ఆ స్పీచ్ స్ఫూర్తితోనే సత్యమేవ జయతే కు సంగీతం అందించాను. ఇందులో మగువా మగువా .. కదులు కదులు.. సత్యమేవ జయతే లాంటి పాటలు హృదయాన్ని కదిలిస్తాయి. కెవ్వు కేక లాంటి మాస్ పాటలు ఉండవా అని అడుగుతున్నారు. ఆ పాటలు చేయాలంటే రాత్రి మొద‌లుపెడితే తెల్ల‌వారేస‌రికి రెడీ అవుతాయి. కానీ ఇలాంటి పాటలు మనసుతో చేయాలి. వకీల్ సాబ్ సిగరెట్ల్ వెలిగించుకునే సినిమా కాదు ఇంట్లో దీపాలు వెలిగించే సినిమా.. అని అన్నారు. రామజోగయ్య శాస్త్రి చ‌క్క‌ని సాహిత్యం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Tags:    

Similar News