RRRని వాడుకోవాల‌నుకుని అడ్డంగా బుక్క‌య్యారు!

Update: 2022-11-01 12:33 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `RRR`. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ మార్చిలో విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించిన విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌ని పాన్ ఇండియా స్టార్ లుగా మార్చిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

రీసెంట్ గా జ‌పాన్ లోనూ విడుద‌లైన  ఈ మూవీ అక్క‌డ కూడా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఫ‌స్ట్ వీక్ లో జ‌పాన్ క‌రెన్సీలో 73 మిలియ‌న్ ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఆశ్చర్య‌ప‌రిచింది. అక్టోబ‌ర్ 21న జ‌పాన్ లోని 44 న‌గ‌రాల్లోని 209 స్క్రీన్ ల‌తో పాటు 31 ఐమ్యాక్స్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. జ‌పాన్ లో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న తొలి భార‌తీయ సినిమాగా `RRR` రికార్డుని సొంతం చేసుకుంది. తాజా నివేదిక ప్ర‌కారం ఇంత వ‌ర‌కు ప్ర‌ద‌ర్శించ‌బ‌డిన విదేశీ సినిమాల్లో `RRR` ముందు వ‌రుస‌లో నిలిచిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇంత‌టి సంచ‌ల‌నాలకు తెర‌లేపి హాలీవుడ్ లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారిన `RRR` క్రేజ్ ని వాడుకోవాల‌నుకుని పాకిస్థానీ సినిమా `ది లెజెండ్ ఆఫ్ జెట్` మేక‌ర్స్ అడ్డంగా ముక్కై నెట్టింట ట్రోల్ కి గుర‌వుతున్నారు. ప్ర‌తీ విష‌యంలోనూ ఎప్పుడూ మ‌న‌తో పోటీప‌డాల‌ని ఆరాట‌ప‌డుతూ బొక్క‌బొర్లా ప‌డుతున్న పాకిస్థానీయులు `RRR` క్రేజ్ ని వాడుకోవాల‌ని చూసి అడ్డంగా నెటిజ‌న్ ల చేతిలో బుక్క‌య్యారు.

ఫ‌వ‌ద్ ఖాన్‌, మ‌హీరా ఖాన్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన `ది లెజెండ్ ఆఫ్ జెట్` అనే పాకిస్థానీ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. అయితే ఈ సినిమా యుకూలో `RRR` రికార్డ్స్ ని కేవ‌లం 17 రోజుల్లోనే అదిగ‌మించింద‌ని మేక‌ర్స్ ఏకంగా ఓ పోస్ట‌ర్ నే రిలీజ్ చేసి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు. పాకిస్థానీ మేక‌ర్ల చీప్ ట్రిక్స్ ని ప‌సిగ‌ట్టిన నెటిజ‌న్ లు వారిని ఏకి పారేస్తున్నారు. యుకేలో స‌రే మ‌రి ఓవ‌రాల్ క‌లెక్ష‌న్స్ ప‌రిస్థితి ఏంట‌ని నిల‌దీస్తూ నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

అయితే పాకిస్థానీ ప్రేక్ష‌కుల వాద‌న మ‌రోలా వుంది. మా సినిమా కేవ‌లం 700 థియేట‌ర్లోల విడుద‌లై ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంద‌ని, `RRR` మాత్రం 9 వేల థియేట‌ర్ల‌లో విడుద‌లైంద‌ని కంపేర్ చేస్తున్నారు. దీంతో ఒళ్లు మండిన మ‌న‌వాళ్లు ఎక్క‌డెక్క‌డ మీ సినిమా ఎన్నికోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టిందో లెక్క‌లు పెట్ట‌మంటే మాత్రం పాకిస్థానీ మేక‌ర్స్ పారిపోతూ త‌మ నైజాన్ని చూపిస్తున్నార‌ని నెటిజ‌న్ లు మండిప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News