చిరంజీవి, పవన్ కు తేడా ఇదే..

Update: 2019-02-28 09:37 GMT
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరది అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ముగ్గురు చుట్టూనే రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు దారులు వేరైనా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ పీఠమే. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తానని ప్రకటించిన పవన్ స్టామినాపై టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

*ప్రజారాజ్యంలా కానివ్వకు..
‘పవన్ కళ్యాణ్ కు అశేష బలం ఉంది. అందుకే గడిచిన 2014 ఎన్నికల్లో పవన్ మద్దతిచ్చిన చంద్రబాబు గెలిచారు. ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడు. సమస్యలపై ప్రతీ నియోజకవర్గానికి వెళ్లి పోరాడుతున్నాడు. కానీ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో తలెత్తిన లోపాలను జనసేనలో పునరావృతం కాకుండా చూసుకుంటే పవన్ కు మంచిది’ అని తమ్మారెడ్డి విశ్లేషించారు..

*చిరు నేర్పరి.. పవన్ మొండి
‘చిరంజీవి మెగాస్టార్ గా తెలుగు తెరను ఏలాడంటే అతడి మెతకవైఖరే కారణం.. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ చిరంజీవి నలుగురితో చర్చించే ఏ నిర్ణయమైనా సావధానంగా  చర్చించి తీసుకుంటాడు. అదే అతన్ని ఓ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. కానీ వపన్ లో మాత్రం ఆ మెతక వైఖరి లేదు. మొడి మనిషి. చిన్నప్పటి నుంచే అంతే.. రాజకీయాల్లో ఈ వైఖరి సరైనదేనా ’ అని తమ్మారెడ్డి పవన్ ను సూటిగా ప్రశ్నించారు.

*జగన్, బాబు వ్యూహాల్లో చిక్కుపోతాడు
రాజకీయాల్లో అప్రమత్తంగా ఉండాలని తమ్మినేని పవన్ కు సూచించారు. హోదా సహా అనేక అంశాలపై పోరాటం చేసే సమయంలో వ్యూహాలు అనుసరించాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే జగన్, చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలకు బలైపోతాడని పవన్ ను హెచ్చరించాడు తమ్మారెడ్డి. వైజాగ్ లో హోదా కోసం పోరాడుదామంటే తాను వెళ్లానని.. కానీ పవనే పిలుపునిచ్చి రాకపోవడం ఏంటని తమ్మారెడ్డి నిలదీశారు.

*చిరంజీవికి జనం వచ్చారు.. ఓట్లు వేయలేదు
పవన్ కళ్యాణ్ సభలకు జనం పోటెత్తుతున్నారు. అదే సమయంలో ఇంతకుమించిన జనం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వచ్చారు. కానీ వాటన్నింటిని చిరంజీవి ఓట్లుగా మలచలేకపోయారు. ఈ విషయంలో పవన్ జాగ్రత్త పడకపోతే జనసేనకు అదే పరిస్థితి వస్తుందని తమ్మారెడ్డి ఘాటుగా హెచ్చరించారు.


Full View
Tags:    

Similar News