హీరోయిన్ లేకుండా సినిమా అంటే అది అసాధ్యం.. ఎంత స్టార్ హీరో వున్నా క్రేజీ హీరోయిన్ గ్లామర్ తళుకులు లేక పోతే సగం గీసి వదిలేసిన బొమ్మలా.. సగం కట్టి వదిలేసిన బిల్డింగ్ లా అసంపూర్తిగా వుంటుంది. అయితే ఈ మధ్య హీరోయిన్ అవసరం లేకుండానే స్టార్ డైరెక్టర్లు సినిమాలు చేసేస్తున్నారు. క్రేజీ స్టార్ల సినిమాలని హీరోయిన్ లేకుండానే తెరపైకి తీసుకొచ్చి ఆశ్చర్య పరుస్తున్నారు. ఇటీవల కార్తీ హీరోగా నటించిన `ఖైదీ` చిత్రం అందరికి గుర్తుండే వుంటుంది. ఇందులో తనకు హీరోయిన్ లేదు. కానీ ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా హీరోయిన్ లేకుండా కార్తి సినిమా చేయడం ఇదే తొలిసారి.
ఆ లోటు ప్రేక్షకులకు తెలియకుండానే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపించి ఆశ్చర్యపరిచాడు లోఓకేష్ కనగరాజ్. ఇక ఈ మూవీ తరువాత ఇదే దర్శకుడు స్టార్ హీరో విజయ్ తో చేసిన `మాస్టర్`లోనూ హీరోయిన్ లేదు. పేరుకి మాళవిక మోహనన్ సినిమాలో కనిపించినా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్ లు కానీ, సాంగ్స్ కానీ లేవు. అంటే ఇందులో హీరోయిన్ మాళవిక మోహనన్ కాదని చెప్పకనే చెప్పేశాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కొంత వరకు హర్ట్ అయ్యారు కూడా.
ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎలాంటి హీరోయిన్ లేకుండా `ఆచార్య` చిత్రాన్ని తెరకెక్కించి షాకిచ్చారు దర్శకుడు కొరటాల శివ. ముందు ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకున్నా పాత్ర ప్రాముఖ్యత అంతగా లేకపోవడంతో అలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో కాజల్ ని నటింపజేయడం ఇష్టలేక తనని సినిమా నుంచి తప్పించామని. ఇందులో చిరుకు హీరోయిన్ లేదని, ఎలాంటి డ్యూయెట్స్ లేదని వెల్లడించి షాకిచ్చారు కొరటాల.
మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్ కు హీరోయిన్ లేకపోవడం ఏంటి? అని అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. చిరు హీరోగా కెరీర్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇలా హీరోయిన్ పాత్రే లేకుండా చేసిన సినిమా లేదు. ఇదే మొదటిసారి. కావాలని ప్లాన్ చేయకపోయినా కథాగమనాన్ని చిరు పాత్ర ఔచిత్యాన్ని బట్టి ఆయనకు జోడీగా హీరోయిన్ లేకుండా కొరటాల శివ తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కథ డిమాండ్ మేరకే అని దర్శకుడు చెబుతున్నా ఏప్రిల్ 29న విడుదలవుతున్న సినిమా చూసిన తరువాత చిరు పక్కన హీరోయిన్ లేకపోయినా ఫరవాలేదని ఫ్యాన్స్ సంతృప్తిని వ్యక్తం చేస్తారా? లేదంటే హీరోయిన్ లేని కథతో చిరుని ఇలా ఎందుకు చూపించారని రియాక్ట్ అవుతారా అని చెప్పుకుంటున్నారు. ఆచార్య విషయంలో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలియాలంటే ఏప్రిల్ 29 వరకు వేచి చూడాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.