సినిమాల పండగొచ్చింది

Update: 2017-06-22 08:19 GMT
సమ్మర్ సీజన్ ను బాహుబలి-2 ఒక్కటే సరిగ్గా ఉపయోగించుకోగలిగింది. మరోవైపు బాలీవుడ్ లోనూ స్టార్స్ సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అందుకే సమ్మర్ సీజన్ పూర్తయ్యాక బాక్సాఫీసు ముందుకు భారీ సినిమాలు వస్తున్నాయి. రంజాన్ సందర్భంగా 23న కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ సినిమాలకు దేశమంతటా ఆదరణ ఉన్నప్పటికీ ఈ సినిమాకు సౌత్ లో గట్టి కాంపిటేషన్ ఎదురు కానుంది.

ట్యూబ్ లైట్ తో పాటు ఇదే రోజున అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నై - బెంగుళూరు - ముంబయిలో సైతం ఈ సినిమా విడుదలవుతోంది. దాదాపు 1800 స్ర్కీన్లలో డీజే సినిమా సందడి చేయనుంది. ఓవర్సీస్ అంతా కలుపుకొని మరో 500 స్ర్ర్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఇదే సమయంలో తమిళంలో జయం రవి - సాయేషా జంటగా నటించి వనమగన్ రిలీజ్ అవుతోంది. శింబు - తమన్నా జంటగా నటించిన ఏఏఏ (అంబనవన్ అసరధవన్ అదంగధవన్) కూడా థియేటర్లకు వస్తోంది. ఈ సినిమాలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.  ఇక మళయాళంలో పృథ్వీరాజ్ హీరోగా నటించిన తియ్యన్ కూడా వస్తోంది.

దేశవ్యాప్తంగా చూసుకుంటే ట్యూబ్ లైట్ రేసులో ముందుంటే.. డీజే సెకండ్ ప్లేసులో ఉంటుందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రేసుగుర్రం - సరైనోడు బంపర్ హిట్ల తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమా కావడం... బన్నీకి మళయాళంలో భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావచ్చని లెక్కలు కడుతున్నారు.  సౌత్ వరకు ట్యూబ్  లైట్ పై డీజే ప్రభావం ఎక్కువగానే ఉంటుందని అంచనా. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News