ఒకప్పుడు నిజంగా స్టార్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేయడంలో చాలా వెనకడుగు వేసేవారు. నిజానికి మన ప్రేక్షకులకు సినిమా తప్పించి వేరే ఎటువంటి వినోదం లేదు కాబట్టి, చక్కగా గోడ మీద పోస్టర్లు పడితే చాలు రిలీజ్ రోజున తండోపతండాలుగా ధియేటర్లకు వచ్చేశేవారు. ఏదో రేడియోలో ప్రకటనలు ఇస్తే సరిపోయేది. రోజులు మారాక 90ల చివర్లలో ఇక టివిల్లో ట్రైలర్లు ఇస్తే సరిపోయేది. అందుకే మన స్టార్లు ఎసి గొడుగులోనుండి బయటకు వస్తే ఒట్టు.
ఇప్పుడిక సీన్ మారింది. మొన్నటివరకు ఒక్క సూపర్ స్టార్ కూడా తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి బయటకే రాలేదు. ఏదో ఆడియో రిలీజు లో రెండు మాటలు చెప్పేసి.. సినిమా రిలీజ్ అయ్యాక హిట్టయితే సక్సెస్ మీట్ పెట్టడం, లేకపోతే అసలు ఎటువంటి మీట్ పెట్టకపోవడం అన్నట్లుండేది తంతు. కాని ఇప్పుడు సీన్ మారింది. మొన్న బాహుబలి సినిమా కోసం రిలీజుకు ముందు అనేక ఛానళ్ళు, రేడియోలు, వెబ్ సైట్ల ఆఫీసులకు తిరిగాడు ప్రభాస్. అలా చేయడం వలనే 350 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
అందుకే మిగిలిన స్టార్లందరూ కూడా ఇప్పుడు ప్రమోషన్ పేరుతో ఏదో తూతూ మంత్రంగా హడావుడి చేయడం కాకుండా సీరియస్సు గా ప్రతీ మీడియా హౌస్ చుట్టూతా తిరిగి ప్రమోట్ చేస్తే కలెక్షన్లు విపరీతంగా ఉంటాయి. అందరూ ఇది ఫాలో అయితే బెటర్. ముందుగా శ్రీమంతుడు ఏం చేస్తాడో చూద్దాం.