ఫ్రీ పబ్లిసిటీ కోసం స్టార్ హీరో ప్లాన్‌

Update: 2016-08-04 05:28 GMT
ఈ మధ్య ఓ స్టార్ హీరో క్లబ్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఓ పబ్ కమ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆ స్టార్.. దాని పబ్లిసిటీ కోసం సూపర్ స్కెచ్ వేశాడు. ప్రచారం కోసం పైసా ఖర్చు చేయకుండా.. తన బిజినెస్ కి తెగ ప్రమోషన్స్ వచ్చేలా ఆ హీరో వేసిన ప్లాన్ తెలిస్తే.. ఔరా ఎంత ముదిరిపోయాడూ అనిపించక మానదు.

చేసేది పబ్ వ్యాపారం.. అందుకే ప్రచారం చేసుకునే ఛాన్స్ లేదు. మరోవైపు స్టార్ హీరో అయి ఉండి.. 'మందు' వ్యాపారం చేస్తున్నాడనే మాటలు పడాల్సి వస్తుంది. అందుకే ఈ రెండిటినీ తప్పించుకుంటూ తన వ్యాపారానికి ప్రచారం దక్కేలా ఓ మాంచి ఐడియా వేశాడీ హీరో. అందుకే తన రీసెంట్ మూవీ సక్సెస్ కావడంతో.. ఆ సినిమాలో డైలాగ్ ను.. అదే సినిమాలో తనతో కలిసి పనిచేసిన వాళ్లను పిలిచి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు.  తిన్నంత తిను.. తాగినంత తాగు అన్నట్లుగా సాగిన ఆ పార్టీ తర్వాత.. ఒక్కసారిగా ఆ పబ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.

అఫ్ కోర్స్ ఆ పార్టీ ప్రధానోద్దేశ్యం ఉచితంగా పబ్లిసిటీ చేసుకోవడమే. ఆ హీరో ఎక్స్ పెక్ట్ చేసినట్లుగా మంచి ప్రచారం వచ్చేసింది. రూపాయి ఖర్చు పెట్టకుండా మీడియా సంస్థలు ఆ ప్లేస్ గురించి జనాలకు చెప్పేశాయి. ఒక్క యాడ్ కూడా ఇవ్వకపోయినా అసలు అలాంటి పబ్ ఒకటి ఉందని జనాలకు తెలిసిపోయింది. ఈ పబ్లిసిటి ప్లాన్ మైండ్ బ్లోయింగ్ కదూ.
Tags:    

Similar News