బాలీవుడ్ కు మకాం మార్చే ప్లాన్ లో టాలీవుడ్ హీరోయిన్..!
టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ లకు కొదవ లేదు. వారానికో కొత్త హీరోయిన్ పరిచయం అవుతూ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ స్టార్ స్టేటస్ అందుకోడావాలని ఆశ పడుతుంటారు. ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారిలో అందం అభినయం టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉన్న ముద్దుగుమ్మలు మాత్రం కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో రాణిస్తుంటారు.
ఓ ఉత్తరాది భామ ఇలానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన అంద చందాలతో తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. వరుస ఆఫర్స్ అందుకుంది. స్టార్ హీరోయిన్ అనిపించుకోలేదు కానీ.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం చేజిక్కించుకుంది.
తెలుగు ప్రేక్షకులు ఆదరించడం.. దర్శక నిర్మాతలు ఎంకరేజ్ చేయడంతో టాలీవుడ్ లో పాగా వేసిందీ అందాల భామ. సొంతంగా ఒక ఇల్లు కూడా కొనుక్కుని ఇక్కడే స్థిరపడిపోయింది. ఇదే క్రమంలో ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా చేసింది. అయితే గత కొంతకాలంగా వరుస పరాజయాలు రావడంతో అమ్మడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా తెలుగులో ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఇతర భాషలపై ఫోకస్ పెట్టింది.. హిందీలో రెండు అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకాం మార్చాలని ప్లాన్ చేసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఆమె ఇప్పుడు ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
అదేంటంటే ఆమె ఎంతో ఇష్టంగా కొనుక్కున్న తన ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగా ఆ ఇంటిని అమ్మి పెట్టమని కొంతమంది బ్రోకర్లను సంప్రదించిందట. ఇల్లు విక్రయించిన తర్వాత ఆమె టాలీవుడ్ నుండి ముంబైకి షిఫ్ట్ అవ్వాలనే ప్లాన్ లో ఉందని అంటున్నారు. తెలుగులో ఎలాగూ ఆఫర్స్ లేవు. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. సో అక్కడే ప్రయత్నాలు చేయడం సరైన నిర్ణయమని భావిస్తోందట.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని.. హిందీ పరిశ్రమకు చెక్కేసారు. అందులో ఒకరిద్దరు రాణిస్తే.. మిగతా వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. మరి ఇప్పుడు బాంబేకి వెళ్లాలని ఆరాటపడుతున్న ఈ బ్యూటీ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.