సమ్మర్ సీజన్ అయిపోయింది. పిల్లల స్కూల్స్ కూడా తెరిచేశారు. టాలీవుడ్ లో కూడా సినిమా పండగ ఆఖరి దశకు వచ్చేసింది. భారీ సినిమాల రేస్ అంతా పూర్తయిపోవడంతో.. ఇక చిన్న చిత్రాల హంగామానే నడుస్తోంది. గత రెండువారాలుగా స్మాల్, మీడియం బడ్జెట్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాడు. నాని జెంటిల్మన్ మినహాయిస్తే.. ఇప్పటివరకూ వేరే ఏ మీడియం బడ్జెట్ మూవీ కూడా క్లిక్ కాలేదు.
ఈ శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో మొదటగా ఒక మనసు గురించే చెప్పుకోవాలి. నాగశౌర్య-నీహారిక జంటగా నటించిన ఈ చిత్రానికి.. మెగా డాటర్ అరంగేట్రమే స్పెషల్ అట్రాక్షన్. క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కడంతో.. యూత్ ని అట్రాక్ట్ చేసే అవకాశాలున్నాయి. యూత్ కి నచ్చితే సక్సెస్ సాధించేసినట్లే అనే అంచనాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక కె.రాఘవేంద్రరావు సమర్పణలో కుందనపు బొమ్మ కూడా ఈ వారమే విడుదలవుతోంది. వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సుధాకర్ - సుధీర్ - చాందినిలు నటించారు.
ఇక శర్వానంద్ - నిత్యామీనన్ లు నటించిన రాజాధిరాజ కూడా ఈ వారమే రిలీజ్ అవుతోంది. హీరో - హీరోయిన్లు ఈ సినిమాని పట్టించుకోకపోయినా.. వీళ్లిద్దరి ట్యాలెంట్ పై ఉన్న నమ్మకంతోనే డబ్బింగ్ బొమ్మని జనాలపై వదిలేస్తున్నారు నిర్మాతలు. మరి వీటిలో నెగ్గేదెన్నో తగ్గేదెన్నో!