తమిళ్ రాకర్స్ గుట్టు రట్టు

Update: 2017-05-21 04:26 GMT
తమిళ్ రాకర్స్..  ఈ పేరు పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రతీవారికి పరిచయం ఉన్న పేరే. చెప్పుకోవడానికి కాస్త సిగ్గుగా ఉన్నా ఇదే వాస్తవం. పైరసీ మహమ్మారి వలన పునాదులు పోతున్న ప్రొడక్షన్ హౌస్లు చాలా ఉన్నాయి. సినిమా విడుదలైన మొదటి రోజునే ఎలా ప్రింట్ వస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కని మర్మం గా ఉండిపోయింది. ఇది ఒక పెద్ద మాఫియా అనవచ్చు.  బాగా పేరూన్న ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కు కూడా  ఈ చిక్కుముడిని విప్పలేకపోయారు. తమిళ్ రాకర్స్ తమిళ్ ఇండస్ట్రికి చాలా సార్లు భాహిరంగ సవాలే  చేశారు. వార్నింగ్ ఇచ్చి మరీ సూర్య సింగం 3 సినిమాను రిలీజ్ చేశారు.

అయితే ఎట్టకేలకు ఈ తమిళ్ రాకర్స్ గుట్టు కాస్త తెలిసిపోయింది. ఈ పేరుబడ్డ మాఫియా గుట్టు రట్టు చేసిన కొయంబత్తూరు చెందిన ఒక డిస్ట్రిబూటర్.. వాట్సాప్ ద్వారా ఆడియో స్టేట్మెంట్ ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే.. ''ఇక్కడి ప్రొడ్యూసర్స్ డబ్బులకు కక్కూర్తి పడి మూవీ ఓవర్సీస్ రైట్స్ ను అసలు పేరు కూడా తెలియని.. అలాగే ప్రపంచ పటంలో ఎక్కడ ఉందో కూడో తెలియని ఒక దేశానికి అమ్ముతాడు. తమిళ్ రాకర్స్ అలాంటి వారిని పట్టుకొని వాళ్లదగ్గర ఒరిజినల్ కంటెంట్ కొని ఆన్ లైన్లో  ఫిల్మ్ ఫస్ట్ డే సాయంకాలం విడుదల చేస్తారు'' అంటూ చెప్పుకొచ్చాడు.  ఈ గుట్టు విప్పిన అయన పేరు తిరుపూర్ సుబ్రమణ్యం. ఈయనో పెద్ద డిస్ర్టిబ్యూటర్. ఇది నిజంగా నిజం.

తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స కౌన్సిల్ చాలా సార్లు ఈ తమిళ్ రాకర్స్  పై చర్య తీసుకోమని ప్రభుత్వం పై ఒత్తిడి చేసింది. తీవ్ర నిరసన తెలిపిన ప్రొడ్యూసర్ల గోడు ఎవ్వడు పట్టించుకోవటం లేదు. ఇలా సాగుతుంది  వారి వీరంగం. ఇప్పుడు టోరెంట్  సైట్లు బ్లాక్ చేసి నిర్మాతలకు కొంత ఉపశమనం కలిగించినా..  తమిళ్ రాకర్స్ మాత్రం ఇంకా అక్కుపక్షిలా ఆన్ లైన్లో తిరుగుతూనే ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News