విశ్వ‌న‌టుడితో ఫ్రేమ్ లో ర‌జ‌నీ-సూర్య‌- విజ‌య్!

Update: 2022-05-15 03:30 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన సినిమా రిలీజై చాలా కాల‌మైంది. ఎట్ట‌కేల‌కు త‌న అభిమానుల‌ను ఖుషీ చేసేందుకు అతడు దూసుకొస్తున్నాడు. ఫ్రేమ్ లో క‌నిపిస్తే అభిమానుల్లో క‌నిపించే ఎగ్జ‌యిట్ మెంట్ వేరు. ఆయ‌న నుంచి ఒక సినిమా వ‌స్తోంది అంటే అందులో సంథింగ్ ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ఆశిస్తారు. ఈసారి కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్. తాజాగా క‌మ‌ల్ న‌టించిన విక్ర‌మ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టీమ్ ప్రచారం ప‌రంగా దూకుడు పెంచింది. తొలిగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముగ్గురు అగ్ర హీరోలు పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఆ ముగ్గురు ఎవ‌రు? అంటే.. #రజినీకాంత్ #కమల్ హాసన్ #సూర్య #విజయ్  వేదిక‌పై ఫ్రేమ్ లో క‌నిపించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. అలాగే విజయ్ సేతుపతి కూడా ఈవెంట్ కి విచ్చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ వేదిక‌పై  శివానీ నారాయణన్ -అనిరుధ్ రవిచందర్ -లోకేష్ కనగరాజ్ లాంటి టాప్ టెక్నీషియ‌న్స్ ఉంటారు.
     
దాదాపు 4 సంవత్సరాల తర్వాత యూనివర్సల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ తెరపై కనిపించ‌నుండ‌డంతో అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఉలగనాయగన్ కమల్ అభిమానులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి-ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్. ఈ ఆదివారం నాడు గ్రాండ్ ఆడియో లాంచ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.

మ్యూజిక్ రిలీజ్ ఈవెంట్ ని ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ హాజరుకానుండంతో టీమ్ పెద్ద రేంజులో వేడుకగా నిర్వహిస్తోంది. లోకేష్ కనగరాజ్ వాస్త‌వంగా కమల్ హాసన్ కి వీరాభిమాని. అందుకే అతను విక్రమ్ రూపంలో తన బెస్ట్ ను అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆడియో లాంచ్ లో క‌మ‌ల్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్- ద‌ళ‌ప‌తి విజ‌య్- సూర్య  ఒకే ఫ్రేమ్ లో క‌నిపించాల‌ని అత‌డు భావించాడ‌ట‌. ఇలాంటి ఒక‌ అరుదైన దృశ్యం కోసం అత‌డిలానే అభిమానులూ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఆదివారం సాయంత్రం నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. విక్రమ్ చిత్రంలో సూర్య అతిధి పాత్రలో నటిస్తున్నట్లు కూడా గుగుస‌లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే విక్రమ్ తర్వాత మరోసారి ద‌ళ‌పతి విజయ్ ని డైరెక్ట్ చేయడానికి లోకేష్ సిద్ధంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకకు ద‌ర్శ‌కుడు లోకేష్ స్వ‌యంగా విజయ్ ని ఆహ్వానించార‌ని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ద‌ళ‌పతి 66 షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ విజయ్ 'విక్రమ్' మ్యూజిక్ విడుదల వేడుకకు వస్తారని భావిస్తున్నారు. ఈ ఈవెంట్ లో  విజయ్ - లోకేష్ 'దళపతి 67'ని అధికారికంగా ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ కు అత్యంత సన్నిహితుడు. అతను ఆడియో లాంచ్ లో పాల్గొంటాడని అంచనాలు ఉన్నాయి. వీట‌న్నిటినీ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

గతంలో కమల్ నిర్మాత‌గా లోకేష్ దర్శకత్వంలో రజనీ నటించాల్సి ఉండగా అది వీలుప‌డ‌లేదు. అయితే విజయ్ తో 'ద‌ళ‌పతి 67' స్క్రిప్ట్ ను లోకేష్ డైరెక్ట్ చేస్తున్నాడనేది సంచలనంగా మారింది. ఈ విషయమై చిత్రబృందం నుండి అధికారిక వివ‌రాలు వెలువ‌డ్డాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి- ఫహద్ ఫాజిల్ పాత్ర‌లు యూనిక్ గా అల‌రించ‌నున్నాయ‌ని స‌మాచారం. విక్రమ్ చిత్రాన్ని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.
Tags:    

Similar News