హీట్ పుట్టించే హేట్ స్టోరీ సాంగ్

Update: 2015-10-29 11:44 GMT

Full View
బూతు సినిమాలను కూడా సిరీస్ గానూ, సీక్వెల్స్ గానూ తీసేయచ్చని  బాలీవుడ్ జనాలు బాగానే ప్రూవ్ చేస్తున్నారు. స్టోరీ అవసరం లేదు.. కంటెంట్ తో పనిలేదు.. కావాల్సిందల్లా అందాలు - ఆరబోతలు - మూతి ముద్దులు - ఒకరిపై మీద ఒకరు పడి దొర్లడాలు. ఇంతే ఉంటాయి హేట్ స్టోరీలో. ఇప్పటికి రెండు సినిమాలొచ్చాయి. అందాలు ఎరవేసి విలన్ పై ఎలా పగ తీర్చుకున్నారన్నదే కాన్సెప్ట్. మరీ ఏం లేకపోతే బాగోదని.. ఓ చిన్న లింక్ ని సస్పెన్స్ లా ఉండేలా ఏదో ఒకటి సెట్ చేస్తారు. అలాగని సినిమా చూసే వాళ్లకు ఆ థ్రిల్ ఏంటో కాసేపటికే అర్ధమయిపోతుంది. అయినా థియేటర్ నుంచి కదల్లేరు ఎవరూ.

కారణం.. అసలు స్టోరీ కోసమైతే హేట్ స్టోరీకి వెళ్లరు కదా. వాళ్లు వెళ్లేది వేరే వాటికోసం. అవి అక్కడ కనిపిస్తుంటాయి. రీసెంట్ గా హేట్ స్టోరీ-3పై బాలీవుడ్‌ లో రచ్చ లాంటి చర్చ జరుగుతోంది. ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేసిన 13 రోజుల్లో కోటి 73 లక్షల హిట్స్ వచ్చాయి. దీంతో మాంజి జోష్ మీదున్న ప్రొడ్యూసర్ ఇప్పుడో సాంగ్ ని జనాలపైకి వదిలాడు. డిసెంబర్ 4న రానున్న ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా ఓ సాంగ్‌ ని రిలీజ్ చేసింది యూనిట్.

మొదటి ట్రైలర్ డైసీ షాపై దృష్టి పెట్టిన డైరెక్టర్.. ఈసారి జరైన్ ఖాన్ పై ఫోకస్ పెట్టాడు. ఈ హీరోయిన్‌ని బాగా హాట్ హాట్‌గా చూపించాడు. లిప్ కిస్ లు - లోనెక్ లు - అండర్ వేర్స్ తో యాక్టింగ్ లు.. ఇవీ సాంగ్ నిండా ఉన్న సరుకు. ఇందులో ఉన్న మసాలా చూస్తేఈ వీడియో కూడా కూడా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. చూస్తుంటే.. మూవీకి వెళ్లినవాళ్లని ఏమాత్రం నిరుత్సాహపరిచేలా లేరు హేట్ స్టోరీ3 యూనిట్.
Tags:    

Similar News