RRR టీఆర్పీ.. టాప్ 10లోకి కూడా రాలే..

Update: 2022-08-25 10:04 GMT
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరపైకి వచ్చిన RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ రికార్డులను క్రియేట్ చేసి.. పెట్టిన పెట్టుబడికి నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా మంచి లాభాలను అందించింది. ఇక ఈ సినిమా చాలామంది. ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకుంది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ  లో కూడా మంచి గుర్తింపు అందుకుంది.

ముఖ్యంగా హిందీ వెర్షన్ కు అయితే ఎంతగానో క్రేజ్ దక్కింది. కేవలం ఇండియన్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గొప్పతనం గురించి అనేక రకాలుగా పొగిడారు.

ముఖ్యంగా రాజమౌళి మేకింగ్ విధానం అద్భుతంగా ఉంది అంటూ అతను నెంబర్ వన్ దర్శకుడు అని కూడా పాజిటివ్ గా స్పందించారు. అయితే అలాంటి సినిమా టెలివిజన్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు.

ఇక ఇటీవల స్టార్ మాలో ఈ సినిమా తెలుగు వెర్షన్ మొదటిసారి ప్రసారం చేయగా మంచి రేటింగ్ అయితే అందుకుంది కానీ పాత రికార్డులను మాత్రం ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ముఖ్యంగా టాప్ టెన్ లో కూడా ఈ సినిమా నిలవలేకపోవడం విశేషం. RRR రసినిమా ఫస్ట్ టైం టిఆర్పి రేటింగ్ 19.62 రావడం విశేషం. ఇక నెంబర్ వన్ స్థానంలో అయితే అల..వైకుంఠపురములో 29.4 టిఆర్పి తో కొనసాగుతోంది.

ఇక తర్వాత సరిలేరు నీకెవ్వరు 23.4 - బాహుబలి సెకండ్ పార్ట్ 22.7 - శ్రీమంతుడు 22.54 - పుష్ప  22.54 - డీజే 21.7 - బాహుబలి ఫస్ట్ పార్ట్ 21.54 - ఫిదా 21.31 - గీతగోవిందం 20.8 - జనతా గ్యారేజ్ 20.69 టిఆర్పి లతో టాప్ టెన్ లో కొనసాగుతున్నాయి.

ఇక వీటిలో RRR సినిమా నిలువలేకపోవడం కొంత ఆశ్చర్యపరిచే విషయం. ఒక విధంగా ఓటీటీ ద్వారా ఈ సినిమాను చాలామంది ఇప్పటికే రెండు మూడుసార్లు చూసేసి ఉంటారు. కాబట్టి టెలివిజన్ లో మరోసారి అంతగా చూసి ఉండకపోవచ్చు. దీన్నిబట్టి ఓటీటీ మార్కెట్ శాటిలైట్ పై ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News