కిక్ 2 పరాజయం బోలెడన్ని నిజాల్ని బైటికి తెచ్చింది. ఈ సినిమా ఐదు విభాగాల్లో అట్టర్ ఫ్లాప్. ఒకటి కథ ఎంపిక, రెండు కంఫర్ట్ కోసం రాసుకున్న సన్నివేశాలు, మూడు నటీనటుల ఎంపిక, నాలుగు ఎడిటింగ్, ఐదు దర్శకుడి నేరేషన్ .. ఇలా ఏ విభాగంలో చెప్పుకున్నా అసలు కిక్కే లేదన్న విమర్శలొచ్చాయి. అయితే హీరో, నిర్మాత ఇద్దరూ దర్శకుడే దీనికి కారణం. స్టార్ డైరెక్టర్, రేసుగుర్రం తీసిన డైరెక్టర్ కాబట్టి అతడికే వదిలేశాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండాఫ్ లో ల్యాగ్ సన్నివేశాల్ని ఎడిట్ చేయాల్సిందిగా చెబితే తన మాట దర్శకుడు వినలేదని రవితేజ ఓపెన్ గానే విమర్శించారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా ఈ సినిమా రచయిత అందించిన వక్కంతం వంశీ గురించిన ప్రస్థావనే లేదు. దర్శకుడి ఫెయిల్యూర్ తో రచయితకు ఏ సంబంధం లేదని అనుకుందాం అంటే ఈ సినిమాలో కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మాటలు కానీ ఎక్కడా ఎక్కిందే లేదు. కొన్ని చోట్ల డైలాగులు మరీ డీ గ్రేడ్ లో ఉన్నాయన్న విమర్శలొచ్చాయి. వక్కంతం నేతృత్వంలోనే ఇలా జరిగింది. కాబట్టి అతడికి ఈ నిందలో కొంత భాగం అప్పజెప్పలేదెందుకో అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ రాసుకున్న స్క్రిప్టు లోనే అసలు విషయం లేదు. అక్కడే దర్శకుడు సగం ఫెయిల్ అయ్యాడు. బ్లేమ్ గేమ్ లో అతడిని ఎందుకు భాగం చెయ్యలేదు? అంటూ విమర్శకుల మధ్య చర్చ సాగడం విశేషం. సూరి, వంశీ దీనికేం సమాధానం చెబుతారో?